Beauty Tips

Hair fall tips: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అంతకు రెట్టింపు జుట్టును పొందాలంటే..

Hair fall tips: జుట్టు విపరీతంగా రాలిపోతోందా? అంతకు రెట్టింపు జుట్టును పొందాలంటే ..జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే రకరకాల నూనెలు,షాంపూలు వాడేస్తూ ఉంటారు.

అలా కాకుండా మనం వాడే షాంపూలో కొన్ని పదార్ధాలు కలిపి వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. కుంకుడు కాయలు వాడితే చాలా మంచిది. కానీ ఇప్పటి తరం పిల్లలు కుంకుడు కాయలు అసలు వాడటం లేదు.

చిన్న కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీటిలో మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బియ్యం నుండి నీటిని వేరు చేసి ఒక బౌల్ లో పోయాలి. బియ్యం నీటిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్, ఒక స్పూన్ తేనె, రెగ్యులర్ గా వాడే షాంపూ వేసి బాగా కలిపి తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేయాలి.

ఇలా చేయటం వలన తలలో పెరుకుపోయిన జిడ్డు,చెమట,చుండ్రు,పేలు వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి జుట్టు కాంతివంతంగా మెరవటమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. బియ్యం నీటిలో ఉండే విటమిన్ బి,సి,అమినో యాసిడ్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

తేనె జుట్టుకి సహజసిద్దమైన మెరుపును ఇస్తుంది. నిస్తేజంగా మారిన జుట్టుకు తేమను అందించి జుట్టు మెరిసేలా చేస్తుంది. జుట్టుకి మంచి పోషణను అందిస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.