Beauty Tips

White Hair Home Remedies:5 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది….జీవితంలో తెల్లజుట్టు అనేది ఉండదు

White Hair Home Remedies:5 నిమిషాల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది….జీవితంలో తెల్లజుట్టు అనేది ఉండదు..ఈ మధ్య కాలంలో తెల్లజుట్టు సమస్య చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. తెల్లజుట్టు సమస్య రాగానే మనలో చాలా మంది కంగారూ పడి మార్కెట్ లో దొరికే అనేక రకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయితే వాటిని వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ఫలితం వస్తుంది.

పొయ్యి మీద పాన్ పెట్టి ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ గుంటగలగరాకు పొడి, ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా నల్లగా అయ్యేవరకు వేగించాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో తయారుచేసుకొని నిల్వ చేసుకోని అవసరం అయినప్పుడు వాడవచ్చు. ఒక బౌల్ ఈ పొడిని వేసి కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని జుట్టుకి బాగా పట్టించి గంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారటమే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి…తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాల సమయం పడుతుంది.

అదే తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. గుంటగలగరాకు, ఉసిరి పొడిని పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. మనం వాడిన అన్నీ పదార్ధాలు సహజసిద్దమైనవి. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.