MoviesTollywood news in telugu

Shivaji: బిగ్ బాస్ శివాజీ ఎంతమందికి డబ్బింగ్ చెప్పారో తెలుసా..

Shivaji: బిగ్ బాస్ శివాజీ ఎంతమందికి డబ్బింగ్ చెప్పారో తెలుసా..శివాజీ మొదట్లో చిన్న పాత్రలు వేసినా చాలా తక్కువ సమయంలోనే హీరోగా నిలదొక్కుకున్నాడు. హీరోగా మంచి సినిమాలు చేసాడు. ఆయన నటనతోనే కాదు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పించారు.

సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. రాజకీయాల పై ఆసక్తితో కొంతకాలం రాజకీయాలలో ఉన్నారు. ఆతర్వాత మళ్లీ సైలెంట్ అయ్యి.. ఆ తర్వాత శివాజీ బిగ్ బాస్ సీజన్ 7తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు.

శివాజీ ఒక పక్క నటిస్తూనే కొంత మంది హీరోలకు డబ్బింగ్ చెప్పాడు. శివాజీ జయం సినిమాలో నితిన్ కు.. సొంతం సినిమాలో ఆర్యన్ రాజేష్ కు.. దిల్, సంబరం సినిమాలో నితిన్ కు.. ఉల్లాసంగ ఉత్సాహంగా సినిమాలో యశో సాగర్.. పిజ్జా సినిమాలో విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పారు.

శివాజీ. 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ తో తిరిగి ప్రేక్షకులను అలరించాడు. మంచి పాత్రలు వస్తే నటించటానికి సిద్దంగా ఉన్నాడు.