Healthhealth tips in telugu

Rice Water Benefits:గంజినీళ్లు పారబోస్తున్నారా.. వాటిని తాగడం వల్ల ఎన్ని లాభాలో ..

Rice Water Benefits:గంజినీళ్లు పారబోస్తున్నారా.. ? వాటిని తాగడం వల్ల ఎన్ని లాభాలో …ఇప్పుడు ఉన్న పరిస్థితులకు ప్రతి ఒక్కరూ మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ కి గంజి అంటే తెలియదు. పిజ్జా, బర్గర్లు అంటే తెలుస్తుంది. కాలంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా మారి పోతున్నాయి.

మన పెద్దవారు తినే ఆహారం అసలు మనం తినడం లేదు. అందువల్లే మన పెద్దవాళ్ళు ఉన్నంత ఆరోగ్యంగా మనం ఉండలేకపోతున్నాం. ఇప్పుడు ఉన్న జనరేషన్ వారు ఆరోగ్యం కోసం కాకుండా రుచి కోసం ఆహారాన్ని తింటున్నారు. అందువల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అప్పట్లో బియ్యాన్ని ఒక గిన్నెలో ఉడికించి గంజిని వంచి తాగేవారు.

అయితే ఇప్పుడు అన్నం కుక్కర్ లో పండు కోవడం వలన గంజి అనేది రావటం లేదు. అందుకే ఈ తరం వారికి గంజి అంటే తెలియడం లేదు. గంజి లో ఉన్న ప్రయోజనాల గురించి తెలిస్తే అన్నమును వార్చుకొని గంజిని తయారుచేసుకుని తాగుతారు. గంజి లో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. స్నానం చేసే నీటిలో కొంచెం గంజి కలిపి స్నానం చేస్తే రోజంతా హుషారుగా ఉంటారు.

గంజిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. కాస్త అలసటగా నీరసంగా నిస్సత్తువుగా ఉన్నప్పుడు గంజి తాగితే తక్షణ శక్తి వస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి. వాంతులు విరేచనాలతో బాధపడేవారికి గంజినిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. గంజిని ముఖానికి రాస్తే కాంతివంతంగా మారుతుంది. అదే జుట్టుకు రాస్తే గంజిలో ఉండే అమైనో ఆమ్లాలు జుట్టు రాలకుండా మృదువుగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.