Beauty Tips

Egg Face Pack: ఈ సమ్మర్ లో ముఖకాంతిని పెంచే ఎగ్ ఫేస్ ప్యాక్స్! మ్యాజిక్ లాగా పనిచేస్తుంది..

Egg Face Pack: ఈ సమ్మర్ లో ముఖకాంతిని పెంచే ఎగ్ ఫేస్ ప్యాక్స్! మ్యాజిక్ లాగా పనిచేస్తుంది..ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణంలో కాలుష్యం వంటి కారణాలతో తాన్, ముడతలు, మృత కణాలు  ఏర్పడుతూ ఉంటాయి. వీటి కారణంగా ముఖం కాంతివిహీనంగా,నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్యల నుండి బయట పడి ముఖం కాంతివంతంగా మారటానికి ఒక అద్భుతమైన చిట్కా ఉంది.

ఈ చిట్కా చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాను ఫాలో అవ్వటం తయారుచేసుకోవడం అంతా సులభమే. ఈ చిట్కా పాటిస్తే ముఖం మీద నలుపు,తాన్,ముడతలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా ఉంటుంది. ఈ చిట్కా కోసం…

గుడ్డు
గుడ్డులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. అయితే ఇవి చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తాయి. గుడ్డులో ఆరోగ్యకరమైన చర్మం కోసం అవసరమైన ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. గుడ్డులో ఉండే లూటిన్ చర్మం ఎలాస్టిక్ గా మరియు తేమగా ఉండేలా చేస్తుంది. చర్మ కణాలను శుద్ధి చేసి చర్మం టైట్ గా ఉండేలా చేస్తుంది.

అలోవెరా జెల్ ఒక స్పూన్
కలబంద చర్మాన్ని బాగా డీప్ గా శుభ్రం చేసి చర్మ రంద్రాలను తెరుచుకొనేలా చేస్తుంది. అలాగే ముఖంపై ఉన్న నలుపు,తాన్,ముడతలను సమర్ధవంతంగా తొలగిస్తుంది.

నిమ్మకాయ పావు చెక్క
నిమ్మకాయ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. మృతకణాలను తొలగిస్తుంది. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ అలాగే విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. కొలాజెన్ ఉత్పత్తిని పెంచి ఏజ్ స్పాట్స్, డార్క్ స్పాట్స్, ట్యాన్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

శనగపిండి
శనగపిండి ముఖంపై ఉన్న నల్లని మచ్చలను,ముడతాలను తొలగించి చర్మం కాంతివంతంగా,తేమగా ఉండేలా చేస్తుంది.

ఒక బౌల్ లో గుడ్డు తెల్లసొన,నిమ్మరసం,శనగపిండి,అలోవెరా జెల్ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.