Beauty Tips

Hair Care Tips:ఈ నూనె వాడితే ఎంత సన్నగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా,పొడవుగా పెరగటం ఖాయం

Hair Care Tips:ఈ నూనె వాడితే ఎంత సన్నగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా,పొడవుగా పెరగటం ఖాయం.. జుట్టు రాలకుండా ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగటానికి ఇంటిలో తయారుచేసుకొనే నూనెలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. దీని కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి 200 గ్రాముల కొబ్బరి నూనె, 100 గ్రాముల ఆముదం పోయాలి.

కాస్త వేడి అయ్యాక పది ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత గుప్పెడు వేప ఆకులను వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ kalonji seeds, ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి. మరిగిన నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను తలకు పట్టించి 5 నిమిషాలు మసాజ్ చేయాలి.

ఈ విధంగా రాత్రి సమయంలో చేసి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయవచ్చు. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల పాటు వాడవచ్చు. జుట్టు రాలే సమస్యకు ఖరీదైన నూనెలను కొనవలసిన అవసరం లేదు.

ఈ నూనె రాయటం వలన తల మీద చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండటమే కాకుండా జూటూ కుదుళ్లను బలంగా చేస్తుంది. ఈ నూనె చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది. ఉసిరి ముక్కలు,వేప ఆకులకు బదులుగా ఉసిరి పొడి,వేప పొడి కూడా వాడవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.