Kitchenvantalu

Kitchen Tips:ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే సమయం,డబ్బు రెండు ఆదా అవుతాయి

Kitchen Tips:ఈ వంటింటి చిట్కాలను పాటిస్తే సమయం,డబ్బు రెండు ఆదా అవుతాయి..చపాతీలు ఎక్కువసేపు మృదువుగా,తాజాగా ఉండాలంటే ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది. హాట్ బాక్స్ లో అల్లం ముక్కలు వేసి ఒక పలుచని క్లాత్ వేసి దానిలో చపాతీలు పెట్టి ఆ క్లాత్ కప్పి హాట్ బాక్స్ మూత పెడితే చపాతీలు మృదువుగా,తాజాగా ఉంటాయి.

వర్షాకాలం వచ్చిందంటే పప్పులు,పిండ్లు పురుగు పడుతూ ఉంటాయి. ఆలా పురుగు పట్టకుండా ఉండాలంటే పప్పుల్లో ఎండుమిరప కాయలు లేదా బిరియాని ఆకులను వేస్తె పురుగు పట్టదు. అలాగే క్రిమి సంహారక లక్షణాలు ఉన్న వేపాకును కూడా వాడవచ్చు.

మసాలా పొడులు,కారం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొంచెం ఉప్పు కలపాలి.

వెల్లుల్లి పొట్టు తొందరగా రావాలంటే వెల్లుల్లిని నీటిలో పావుగంట సేపు నానబెట్టి ఆ తర్వాత తొక్క తిస్తె తొందరగా వచ్చేస్తుంది.

పాలను తోడుపెట్టటానికి పెరుగు లేనప్పుడు ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. పాలను గోరువెచ్చగా చేసి రెండు ఎండుమిరపకాయలను తొడిమలతో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. 12 గంటల తర్వాత మూత తీసి చూస్తే పెరుగు తయారవుతుంది. ఎండుమిరపకాయలకు బదులుగా పచ్చి మిరపకాయలను కూడా వాడవచ్చు.

పచ్చిమిరపకాయలు చాకుతో కట్ చేస్తూ ఉంటాం. ఆలా కట్ చేసినప్పుడు చేతులు మండుతూ ఉంటాయి. ఆలా మండకుండా ఉండాలంటే పచ్చిమిరపకాయలను చాకుతో కాకుండా కత్తెరతో కట్ చేయాలి.

మిక్సీ ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. ఆలా వాడినప్పుడు మిక్సీ జార్ లో ఉండే బ్లేడ్ పదును తగ్గిపోతుంది. అప్పుడు మిక్సీ జార్ లో ఉప్పు వేసి 30 సెకన్ల పాటు రన్ చేస్తే జార్ బ్లేడ్ పదును పెరుగుతుంది. ఈ విధంగా నెలకు ఒకసారి చేస్తూ ఉంటే మిక్సీ జార్ బ్లేడ్ పదును తగ్గకుండా ఉంటుంది.

పూరి క్రిస్పీగా రావాలంటే పూరి పిండి కలిపేటప్పుడు పిండిలో ఒక స్పూన్ బొంబాయి రవ్వ కానీ రెండు స్పూన్ల బియ్యంపండి కానీ కలపాలి. అప్పుడు పూరీలు క్రిస్పీగా రుచిగా ఉంటాయి.

చపాతీలు మృదువుగా మెత్తగా రావాలంటే చపాతీ పిండి కలిపేటప్పుడు గోరువెచ్చని నీరు లేదా గోరువెచ్చని పాలను కలపాలి. కలిపిన పిండిని బాగా మర్దన చేసి అరగంట తర్వాత చపాతీ చేసుకుంటే మృదువుగా వస్తాయి.

పూరీలు లేదా వేపుళ్ళు చేసినప్పుడు నూనె ఎక్కువగా పిల్చుతుందని చేసుకోవటం తగ్గిస్తూ ఉంటాం. అలా నూనె పీల్చకుండా ఉండాలంటే వెగించే నూనెలో కొంచెం ఉప్పు వేసి బాగా కలిపితే చేసే వంటకం నూనె ఎక్కువగా పీల్చదు.

అల్లం వెల్లుల్లి పేస్ట్ నెల రోజుల పాటు నిల్వ ఉండాలంటే అల్లం,వెల్లుల్లి రెండింటినీ పై పొత్తు తీసి మిక్సీ లో మెత్తని పేస్ట్ గా2చేసి ఒక బౌల్ లోకి తీసుకొని నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రీడ్జ్ లో పెడితే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది.