Beauty Tips

Hair Care Tips:10 రూపాయిల ఖర్చుతో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా స్ట్రైట్ గా,మృదువుగా…

Hair Care Tips:10 రూపాయిల ఖర్చుతో జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటమే కాకుండా స్ట్రైట్ గా,మృదువుగా… ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా మృదువుగా మెరుస్తూ ఉండాలని కోరుకుంటారు. అయితే చాలామంది జుట్టు చూస్తే గడ్డిలా ఎండిపోయినట్టు కనబడుతుంది.

అలాగే జీవం లేకుండా ఉంటుంది. జుట్టు సాఫ్ట్ గా చేయటానికి ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. దీనికోసం ఒక కొబ్బరికాయను తీసుకుని కొబ్బరి ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి దాని నుంచి పాలు తీయాలి.

రెండు బాగా పండిన అరటి పండ్లను తీసుకుని మిక్సీలో వేయాలి. కొబ్బరి పాలను పోసి మిక్సీ చేయాలి. ఈ మిశ్రమంలో రెండు స్పూన్ల వెన్న, రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరి నూనె లేదా బాదం నూనె వేయాలి, ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు అప్లై చేయాలి. అరగంటయ్యాక రెగ్యులర్ షాంపూతో తలస్నానం చేయాలి.

హెయిర్ ప్యాక్ తలస్నానం చేసిన జుట్టు పై లేదా నూనె ఉన్న జుట్టు పై కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ జుట్టుకు పోషణను అందించి జుట్టు మృదువుగా,స్ట్రైట్ గా, అందంగా, మెరిసేలా చేస్తుంది.అరటి పండ్లలో సిలికా అనే ఖనిజం ఉంటుంది. అది జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.

అలాగే యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి చుండ్రు సమస్య లేకుండా చేస్తాయి. ఆలివ్ ఆయిల్ జుట్టును తేమగా ఉంచుతుంది. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు వేస్తే మంచి ప్రయోజనం కనబడుతుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.