Beauty Tips

Dark Spots:ఈ పేస్ట్ రాస్తే ముఖం,మెడ,చేతుల దగ్గర నలుపు పోయి చక్కటి మెరుపు వస్తుంది

Dark Spots:ఈ పేస్ట్ రాస్తే ముఖం,మెడ,చేతుల దగ్గర నలుపు పోయి చక్కటి మెరుపు వస్తుంది..ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా,తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు.

దాని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు. అలా కాకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ముఖం,మెడ,చేతుల దగ్గర నలుపును తగ్గించుకోవచ్చు.

కీరా దోసకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసంలో నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి స్కిన్ టాన్ అయిన చోట రాయాలి. ముఖం,మెడ,చేతుల దగ్గర నలుపు ఉన్న ప్రదేశంలో రాసి పావుగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఇలా చేయటం వలన చర్మం మీద ఉన్న మృత కణాలు తొలగిపోతాయి. సన్ టాన్ తొలగిపోయి చర్మ చాయ మెరుగుపడుతుంది. నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కీరదోసకాయ, నిమ్మకాయ రెండు కూడా చాలా తక్కువ ఖర్చులోనే లభ్యం అవుతాయి.

కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన వాటిని ఉపయోగించడం కంటే ఇలా నేచురల్ గా చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒరిజినల్ స్కిన్ టోన్ వస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కా ఫాలో అయితే మంచి ఫలితం వస్తుంది. నిమ్మకాయ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి మృత కణాలను తొలగిస్తుంది. కీరదోస అవసరమైన పోషకాలను అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.