Beauty Tips

Face Glow Tips:కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే నల్లని మచ్చలు అన్నీ మాయం

lemon and face glow tips:కాఫీ పొడిలో ఇది కలిపి రాస్తే నల్లని మచ్చలు అన్నీ మాయం.. ఈ మధ్యకాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలని కోరు కుంటున్నారు. అలా కోరుకోవడం సహజమే. దీనికోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేలకొద్ది డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా ఈజీగా ముఖం మీద నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నింటిని తొలగించుకోవచ్చు.ఒక బౌల్ లో అరస్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ కాఫీపొడి, రెండు స్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం మీద నిమ్మచెక్కతో స్క్రబ్ చేస్తూ అప్లై చేసుకోవాలి.

ఐదు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. బాగా ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే. ముఖం మీద నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి తెల్లగా మెరిసిపోతుంది. బేకింగ్ సోడా పడని వారు ENO వాడవచ్చు. అలాగే నిమ్మరసం పడని వారు టమోటా రసం ఉపయోగించవచ్చు.

ఈ మిశ్రమాన్ని మెడ, కాళ్లు, చేతులు నల్లగా ఉన్న ప్రాంతాల్లో కూడా రాయవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త సమయాన్ని కేటాయించి శ్రద్ద పెడితే చాలు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.