Beauty Tips

Face Glow Tips:ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 5 నిమిషాల్లో ముఖం మీద మురికి పోయి తెల్లగా మెరిసిపోతారు

Besan Face Glow Tips:ఒక్క రూపాయి ఖర్చు లేకుండా 5 నిమిషాల్లో ముఖం మీద మురికి పోయి తెల్లగా మెరిసిపోతారు.. ఎండాకాలం ప్రారంభం అయింది. ఎండలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో చర్మంపై చెమట,దుమ్ము,ధూళి టాన్ పెరుకుపోయి ముఖం నల్లగా,నిస్తేజంగా కనపడుతుంది. ఈ సమస్యల నుండి బయట పడటానికి ఒక మంచి ప్యాక్ ని ఇంటిలో ఉండే వస్తువులతో సులభంగా చేసుకోవచ్చు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగపిండి, అరస్పూన్ కస్తూరి పసుపు,ఒక స్పూన్ పెరుగు కలిపి ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖం మీద నీటిని జల్లుతు నెమ్మదిగా రబ్ చేస్తూ ముఖాన్ని వాష్ చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం మీద అదనంగా ఉత్పత్తి అయ్యే నూనె తగ్గితుంది.

చెమట,దుమ్ము,ధూళి పేరుకొని నల్లగా మారిన చర్మం తెల్లగా కాంతివంతంగా మారుతుంది. అలాగే చర్మంపై మృతకణాలు తొలగిపోయి తాజాగా ఉంటుంది. ముడతలు లేకుండా చర్మం యంగ్ లుక్ లో ఉంటుంది, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంలోని మృతకణాలను తొలగించటానికి సహాయపడుతుంది.

శనగపిండి చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పైసా ఖర్చు పెట్టకుండా వంటింటిలో ఉండే వస్తువులతో సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."