Beauty Tips

White Hair Turn Black:5 నిమిషాల్లో తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…

White Hair Turn Black:5 నిమిషాల్లో తెల్ల జుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది… ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది.

సాధారణంగా జుట్టు అనేది వయస్సు పెరిగే కొద్దీ రంగు మరియు పటుత్వం కోల్పోయి తెల్లగా మారుతుంది, అలాగే జన్యుపరమైన సమస్యలు ,వంశపారంపర్య కారణాలు, అనారోగ్య కారణాల వల్ల కూడా జుట్టు తెల్లగా మారుతుంది. జుట్టు అనేది నల్లగా ఉంటేనే అందం.

తెల్లజుట్టు సమస్య అనేది ఈ రోజుల్లో చాలా చిన్న వయస్సులోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ డ్రై లను వాడుతూ ఉంటారు. అలా వాడకుండా మన ఇంటిలో దొరికే సహజసిద్దమైన పదార్ధాలతో సులభంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

ఈ చిట్కా కోసం కేవలం 4 పదార్ధాలను ఉపయోగిస్తున్నాం. ముందుగా పొయ్యి వెలిగించి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో ఒక స్పూన్ కాఫీ పొడి వేయాలి. కాఫీ నీటిలో బాగా మరిగాక ఆ నీటిని ఒక బౌల్ లోకి తీసుకొని దానిలో 4 లవంగాలను పొడి చేసి వేయాలి. ఆ తర్వాత 2 స్పూన్ల గోరింటాకు పొడి,ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. ఈ రెమిడీ తెల్లజుట్టును నల్లగా మార్చటమే కాకుండా చుండ్రు,జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటానికి సహాయపడుతుంది. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అవ్వండి.

ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది. ఉసిరి పొడిని, గోరింటాకు పొడిని ఇంటిలో తయారుచేసుకోవచ్చు. లేదంటే మార్కెట్ లో లభ్యం అవుతుంది. లవంగాలను మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. అలాగే కాఫీ పొడి కూడా చాలా సులభంగా లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.