Kitchenvantalu

Bread Upma:మసాలా బ్రెడ్ ఉప్మా..ఇలా 5 నిమిషాల్లో చేసేసి రుచిగా తినేయచ్చు

Bread Upma:మసాలా బ్రెడ్ ఉప్మా..ఇలా 5 నిమిషాల్లో చేసేసి రుచిగా తినేయచ్చు.. ఉదయం సమయంలో బ్రెడ్ తో ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా అయ్యిపోతుంది.

కావలసిన పదార్దాలు
బ్రెడ్ ముక్కలు – 4 లేదా 5 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు
పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
పచ్చిమిరపకాయలు – 4(ముక్కలుగా కోసుకోవాలి)
పసుపు – చిటికెడు
ఆవాలు – ఒక స్పూన్
జీలకర్ర – ఒక స్పూన్
మినపప్పు – ఒక స్పూన్
కరివేపాకు – కొద్దిగా
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 3 స్పూన్స్
చక్కెర – చిటికెడు
ఇంగువ – చిటికెడు

తయారుచేసే విధానం
ఒక బాండి లేదా మందపాటి గిన్నె తీసుకోని దానిలో కొంచెం నూనె వేసి అందులో మినపప్పు,ఆవాలు,జీలకర్ర,పచ్చిమిరప ముక్కలు వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇంగువ వేసి మరికొద్ది సేపు వేగనివ్వాలి.

ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు,కరివేపాకు వేసి దోరగా వేగించి ఉప్పు,పసుపు,చక్కెర కూడా జత చేయాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత బ్రెడ్ ముక్కలు,కొబ్బరి తురుము వేసి నాలుగు నిముషాలు పొయ్యి మీద ఉంచి దించేయాలి. దీన్ని వేడి వేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.