Kitchenvantalu

Dry fruit milkshake:నీరసం తగ్గించి ఆరోగ్యానిచ్చే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్

Dry fruit milkshake:నీరసం తగ్గించి ఆరోగ్యానిచ్చే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్.. వేసవి కాలం ప్రారంభం అయింది. ఈ కాలంలో వేడి కారణంగా చాలా త్వరగా అలసట,నీరసం వస్తాయి. అలాంటి సమయంలో Dry fruit milkshake తాగితే బాగుంటుంది.

కావలసిన పదార్థాలు
జీడిపప్పు – గుప్పెడు
బాదం పప్పు – గుప్పెడు
అంజీరా – 5 ముక్కలు
ఖర్జురం – 5-6
చక్కెర – 2-3 స్పూన్స్
పాలు – అర లీటరు

తయారీ విధానం
జీడీపప్పు, బాదంపప్పు, అంజీరా, ఖర్జురంఅన్నింటిని ఒక బౌల్ లో వేసుకుని 5 గంటలు నానబెట్టాలి. బాగా నానాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. పాలను వేడి చేసి ఈ పేస్ట్ ని పాలల్లో వేసి బాగాకలపాలి. బాగా మరిగాక పంచదార వేసుకోవాలి. పంచదారకు బదులు తేనే కూడా కలపవచ్చు. ఈ మిల్క్ షేక్ చాలా రుచిగా ఉంటుంది.