Beauty Tips

White Hair turn black:తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి…

White Hair turn black:తెల్లజుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరి… ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు వచ్చేస్తుంది. దాంతో కంగారు పడి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలతో చాలా సులభంగా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. శరీరంలో మెలనిన్ తగ్గటం వలన తెల్ల జుట్టు ఏర్పడుతుంది. జుట్టు నల్లగా ఉండటానికి మెలనిన్ సహాయపడుతుంది.

అయితే మెలనిన్ అనేది వయస్సు పెరిగే కొద్ది తగ్గుతుంది. కానీ ఇప్పటి రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. దీనికి హార్మోన్స్ సమతుల్యత,ఇతర ఆరోగ్య సమస్యలు కారణం అవుతాయి. చాలా మంది తెల్లజుట్టు నల్లగా మారటానికి హేయిర్ డ్రై వేస్తూ ఉంటారు. ఈ హేయిర్ డ్రై లు జుట్టులో ఉండే సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోయి జుట్టు జీవం లేకుండా నిర్జీవంగా మారుతుంది.

అంతేకాక జుట్టు అధికంగా రాలిపోతుంది. హేయిర్ డ్రై లు వాడకుండా కొన్ని సహజసిద్ధమైన పదార్ధాలను ఉపయోగించి తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఆ సహజసిద్ధమైన పదార్ధాల గురించి వివరంగా తెలుసుకుందాం.

కాఫీ
కాఫీ పొడిలో సహజసిద్ధమైన డైయింగ్ లక్షణాలు ఉండటం వలన డైయింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టును ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. 150 మిల్లీలీటర్ల నీటిలో 3 స్పూన్ల కాఫీ పొడిని వేసి బాగా మరిగించి వడకట్టాలి. ఈ కాఫీ నీటిని జుట్టుకు పట్టించి 45 నిమిషాల తర్వాత జుట్టును కడగాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది.

ఉసిరి
ఉసిరిలో డైయింగ్ లక్షణాల కారణంగా చాలా రకాల హెయిర్ డ్రై లలో ఉసిరిని వాడటం చూస్తూ ఉంటాం. ఉసిరిలో మెలనిన్ ఎక్కువగా ఉండుట వలన తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. ఉసిరిలో ఉండే మెలనిన్ జుట్టు తెల్లపడే ప్రక్రియను నిదానం చేస్తుంది. ఉసిరి పొడిలో కొబ్బరినూనె కలిపి గోరువెచ్చగా వేడి చేసి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కడగాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే జుట్టు నల్లగా,ఒత్తుగా పెరుగుతుంది.

బంగాళాదుంప
బంగాళాదుంప తొక్కలు జుట్టుకు సహజసిద్ధమైన రంగును ఇస్తుంది. బంగాళాదుంప తొక్కలను నీటిలో వేసి బాగా ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఆ నీటిని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత సాధారణమైన నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.

ఆవు నెయ్యి
ఆవునెయ్యిని జుట్టుకు పట్టించి మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.