Beauty Tips

Hair Care Tips:ఈ పేస్ట్ ని తలకు రాసి 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది

Hair Care Tips:ఈ పేస్ట్ ని తలకు రాసి 30 నిమిషాల తర్వాత స్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు ఆడ మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధ పడుతున్నారు.

జుట్టుకు సరైన పోషణ లేకపోవటం, కెమికల్ పోల్యూషన్ వలన డ్రై అవ్వడం, చిట్లి పోవడం వంటి సమస్యలు వస్తాయి. వీటి కోసం మార్కెట్ లో దొరికే ఉత్పత్తులను వాడవలసిన అవసరం లేదు.

ఇంటిలో సహజసిద్దంగా దొరికే వస్తువులతో జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు. ఒక బౌల్ లో బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి వేయాలి. దీనిలో ఒక స్పూన్ ఆముదం,ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ పేస్ట్ ని మాడుకి, జుట్టుకి బాగా పట్టించాలి.గంట అయ్యాక షాంపూతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే క్రమంగా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు చిట్లకుండా ఉంటుంది. పొల్యూషన్ నుండి జుట్టుకి రక్షణ కలుగుతుంది. జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరగటమే కాకుండా జుట్టు మెరుపుతో కాంతివంతంగా ఉంటుంది. ఈ పేస్ట్ జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది.

జుట్టుకి తగిన పోషకాలు అందకపోవడం వలన కూడా జుట్టు ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది. ఈ పేస్ట్ అప్లై చేయడం వలన జుట్టు నల్లగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ పేస్ట్ ట్రై చేసి జుట్టుకి సంబందించిన సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.