Kitchenvantalu

Palakura Vadiyalu:ఎలాంటి పిండితో పని లేకుండా ఈజీగా చేసుకోగలిగే పాలకూరతో వడియాలు

Palakura Vadiyalu:ఎలాంటి పిండితో పని లేకుండా ఈజీగా చేసుకోగలిగే పాలకూరతో వడియాలు.. పప్పు ,చారు ,పులుసు,కూర ఏదైనా అంచుకి నాలుగు వడియాలు ఉన్నాయంటే ఇష్టంగా లాగిస్తారు. పాలకూర వడియాల కాంబినేషన్ ఎప్పుడైన ట్రై చేసారా లేదంటే ఈ సారి చేసి చూడండి.

కావాల్సిన పదార్ధాలు
బియ్యం – 1 కప్పు
పాలకూర – 2 కట్టలు
నువ్వులు – 3 టేబుల్ స్పూన్స్
జీలకర్ర – 1 టీ
పచ్చిమిర్చి – 4
ఉప్పు – తగినంత

తయారీ విధానం
1.ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి,.
2.పాలకూరను కడిగి ఆకులను తరిగి పక్కన పెట్టుకోవాలి.
3.స్టవ్ పై ప్యాన్ పెట్టుకోని 3 కప్పు ల నీళ్లు పోసి మరగనివ్వాలి.
4.మరుగుతున్న ఎసరులోకి బియ్యం ,పాలకూర,సన్నగా తరిగిన పచ్చిమిర్చి,ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
5.మూతపెట్టుకోని అన్నం దగ్గర పడేవరకు ఉడికించాలి.

6.అన్నం దగ్గర పడినప్పుడు మంటను తగ్గిచ్చి మరో పది నిమిషాలు ఉడికించుకోవాలి.
7.ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అందులోకి నువ్వులు ,జీలకర్ర వేసి కలుపుకోని కాసేపు చల్లారనివ్వండి.
8.ఇప్పుడు కాటన్ క్లాత్ గాని,ప్లాస్టిక్ షీట్ పై పై అన్నం బాల్స్ తీసుకోని అప్పడాలుగా పల్చగా వత్తుకోని ఆరబెట్టుకోవాలి.
9.చేసుకున్న వడియాలను రెండు,మూడు రోజులు ఎండలో ఆరనివ్వాలి.
10.వడియాలు ఆరాక..అవతలి వైపు తడి చేసి వడియాలను తీసుకోవాలి.
11.తీసుకున్న వడియాలను మరో రెండు రోజులు ఎండలో పెట్టుకోని ఎయర్ టైట్ కంటేనర్ లో స్టోర్ చేసుకోవాలి.