Beauty Tips

Face Glow Tips:ఈ పేస్ట్ ముఖానికి రాస్తే 2000 పెట్టినా రాని గ్లో 10 రూపాయిలతో వస్తుంది…బ్యూటీపార్లర్ అవసరం ఉండదు

Face Glow Tips:ఈ పేస్ట్ ముఖానికి రాస్తే 2000 పెట్టినా రాని గ్లో 10 రూపాయిలతో వస్తుంది…బ్యూటీపార్లర్ అవసరం ఉండదు.. మనలో చాలామంది ముఖం అందంగా మెరవడం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు.

ముఖ్యంగా పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు. అలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండా మన ఇంటిలో సహజ సిద్దమైన పదార్థాలతో చాలా సులభంగా మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.

ఒక బొప్పాయి పండును తీసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఒక బౌల్ లో రెండు స్పూన్ల బొప్పాయి పేస్టు, ఒక స్పూన్ బియ్యప్పిండి వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిమిషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మచ్చలు, పిగ్మెంటేషన్, మొటిమలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

బొప్పాయిలో మినరల్స్, విటమిన్ లు సమృద్దిగా ఉండుట వలన చర్మ సంరక్షణలో సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం చర్మం పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి బొప్పాయి చర్మాన్ని కాపాడుతుంది. బొప్పాయి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది.

బొప్పాయి తేలికపాటి ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి చర్మం మీద ఉన్న మృతకణాలను తొలగించి చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ముఖం మీద మురికి,దుమ్ము,ధూళిని తొలగిస్తుంది. నల్లని మచ్చలను తొలగించి స్కిన్ టోన్ మెరుగుపడేలా చేస్తుంది. బొప్పాయిలో పాపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ అవాంఛిత జుట్టును తొలగించటానికి సహాయపడుతుంది.

బియ్యం పిండిని చర్మ సంరక్షణలో పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. బియ్యం పిండిలో ఉన్న లక్షణాలు చర్మం మీద మురికిని, దుమ్ము, ధూళిని తొలగించి ముఖం తెల్లగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరుస్తుంది. బొప్పాయి, బియ్యం పిండి కలిపి చేసిన ఈ ప్యాక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.