Beauty Tips

Face Glow Tips:అందానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఎగ్ వైట్ తో ఇలా చేయండి…

Face Glow Tips:అందానికి వేలకు వేలు ఖర్చు పెట్టే బదులు ఎగ్ వైట్ తో ఇలా చేయండి… చాలా చక్కని పలితాన్ని పొందవచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మెరుస్తుంది. కేవలం రూ 5 ఖర్చుతో ముఖం మీద ముడతలు పోవటమే కాకుండా చర్మం మృదువుగా మారుతుంది.

ఎగ్, పెరుగు, అవకాడో:
1 గుడ్డులోని తెల్లసొన, ఒక టేబుల్ స్పూన్ అవకాడో, అంతే మోతాదులో పెరుగు మిక్స్ చేయాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత.. నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. చర్మానికి మాయిశ్చరైజర్ అంది.. స్మూత్ గా మారుతుంది.

ఎగ్, తేనె :
1 టేబుల్ స్పూన్ తేనె మిక్స్ చేయాలి. రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత.. స్క్రబ్ చేసి శుభ్రం చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్.. చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి.

ఎగ్, అరటిపండు, ఆల్మండ్ ఆయిల్:
1ఎగ్ వైట్, 1 టేబుల్ స్పూన్ అరటిపండు గుజ్జు, కొన్ని చుక్కల ఆల్మండ్ ఆయిల్ కలపాలి. అన్నింటినీ మిక్సీలో వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల.. చర్మంలో మలినాలు బయటకుపోయి.. చర్మానికి కొత్తమెరుపుని అందిస్తుంది. అలాగే.. ఏజింగ్ ప్రాసెస్ ని స్లోగా మారుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.