Beauty Tips

Hair Care Tips:లవంగాలతో ఇలా చేస్తే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా పెరుగుతుంది

Cloves and Lemon Hair Care Tips:లవంగాలతో ఇలా చేస్తే ఎంత పలుచగా ఉన్న జుట్టు అయినా ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. మనలో చాలా మంది పొడవైన,ఒత్తైన జుట్టు కావాలని కోరుకుంటారు. దాని కోసం ఖరీదైన షాంపూలు,నూనెలు,సీరంలను వాడుతూ ఉంటారు.

అలా వాటి కోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంటిలో ఉండే వస్తువులతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చు.

అంగుళం అల్లం ముక్కను తొక్క తీసి తురుముకోవాలి. ఆ తర్వాత నిమ్మకాయ తొక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మూడు స్పూన్ల లవంగాలను మెత్తని పొడిగా చేసుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నె పెట్టి ఒక కప్పు ఆలివ్ నూనె పోసి కాస్త వేడి అయ్యాక అల్లం తురుము,నిమ్మ తొక్కల ముక్కలు,లవంగాల పొడి వేసి బాగా కలిపి మరిగించాలి.

10 నిమిషాలు మరిగిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి చల్లారాక పలుచని క్లాత్ సాయంతో నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనె దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి Cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

ఈ విధంగా మూడు రోజులకు ఒకసారి చేస్తే జుట్టు రాలే సమస్య,చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది. లవంగాలలో అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు మరియు పోషకాలు ఉండుట వలన జుట్టు పెరుగుదల మరియు బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. నిమ్మకాయతొక్క లోని యాంటీ ఫంగల్ గుణాలు తలలో ఫంగస్ అభివృద్ధిని ఆపుతాయి.

అంతేకాకుండా తలపై ఏర్పడిన మురికి మరియు ధూళిని కూడా తొలగిస్తుంది. ఆలివ్ నూనెలో ఉన్న పోషకాలు తల మీద రక్తప్రసరణను పెంచి జుట్టు కుదుళ్లను బలపరచి జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్యను తగ్గించుకొని జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.