Healthhealth tips in telugu

Sabja Seeds and Chia seeds:చియా గింజలు Vs సబ్జా గింజలు…రెండింటిలో బరువు తగ్గించటానికి ఏది బెస్ట్…?

Sabja Seeds and Chia seeds:చియా గింజలు Vs సబ్జా గింజలు…రెండింటిలో బరువు తగ్గించటానికి ఏది బెస్ట్… చియా గింజలు,సబ్జా గింజలు రెండింటిలోను ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా అధిక బరువు సమస్య నుండి బయట పడేస్తుంది. అయితే మనలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.

బరువు తగ్గించటానికి చియా సీడ్స్ లేదా సబ్జా గింజలు ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనే సందేహం ఉంటుంది. చియా విత్తనాలు ఎప్పుడూ నల్లగా ఉండవు. ఇది బూడిద, గోధుమ, తెలుపు, నలుపు విత్తనాల మిశ్రమం. అవి కొంచెం పెద్దవి, అండాకారంలో ఉంటాయి. మరోవైపు, సబ్జా గింజలు జెట్ నలుపు, చిన్నవి ,గుండ్రంగా ఉంటాయి.

సబ్జా,చియా గింజలు రెండింటిలోను దాదాపుగా ఒకే రకమైన పోషకాలు ఉంటాయి. అయితే కేవలం బరువు తగ్గటానికి ఈ గింజలను వాడుతూ ఉంటే మాత్రం చియా గింజలు కాస్త ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని పరిశోదనలో తేలింది. అయితే సబ్జా గింజల మీద పెద్దగా పరిశోదనలు జరగలేదు. చాలా తక్కువగా జరిగాయి.

బరువు తగ్గటానికి సబ్జా,చియా రెండింటినీ ఉపయోగించవచ్చు. అయితే, బరువు తగ్గడం అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం అని గుర్తుంచుకోండి. ఈ విత్తనాలను మాత్రమే తీసుకోవడం మీకు పెద్దగా సహాయపడదు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.