Kitchenvantalu

Special Bonda Soup Recipe:కర్ణాటక స్పెషల్ బోండా సూప్.. ఒక సారి తింటే అసలు వదిలిపెట్టరు

Special Bonda Soup: ఏ వంటకం అయినా, మనం ఎలా చేస్తామో, అలాగే కాకుండా, అప్పుడప్పుడు, పక్కవారి స్టైల్స్ కూడా ఫాలో అవ్వాలి. దాంతో చేసే స్టైల్ మారుతుంది. రుచిలో కూడా తేడా ఉంటుంది. మన దగ్గర బోండా రుచి అందరికి తెల్సిందే కదా. దానికి కాస్త కర్నాటక స్టైల్ జోడించి, బోండా సూప్ చేసి చూడండి. అదిరిపోతుంది.

కావాల్సిన పదార్ధాలు
మినపప్పు – 1.5
ఉప్పు – తగినంత
పెసరపప్పు – 1/2కప్పు
నూనె – 2 టీస్పూన్స్
ఆవాలు – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
కరివేపాకు – 2 రెబ్బలు
అల్లం తరుగు – 1 ఇంచ్
వెల్లుల్లి – 1
పచ్చిమిర్చి తరుగు – 2 టేబుల్ స్పూన్స్
ఇంగువ – చిటికెడు
ఉల్లిపాయ తరుగు – ½ కప్పు
పసుపు – 1/2టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
టమాటో ముక్కలు – 1 కప్పు
కొత్తిమీర – 1 కట్ట
నీళ్లు – 750 ml
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
పచ్చికొబ్బరి తురుము – 1/4కప్పు
మిరియాల పొడి – 1/2టీ స్పూన్

తయారీ విధానం
1.మినపప్పును శుభ్రంగా కడిగి, నాలుగు గంటల పాటు నానపెట్టి , నానిన తర్వాత, తగినంత ఉప్పు, నీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి.
2.ఇప్పుడు సూప్ కోసం నానపెట్టిన పెసరపప్పులో, 1 ¼ కప్పుల నీళ్లు పోసి, మెత్తగా ఉడికించుకోవాలి.
3.ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని నూనె వేసి అందులోకి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇంగువ వేసి వేపుకోవాలి.
4.తర్వాత ఉల్లిపాయలు, వేగాక, అందులోకి టమాటో ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి, మెత్తగా ఉడికించాలి.

5.టమాటా గుజ్జుగా తయారైన తర్వాత , అందులోకి పెసరపప్పు వేసి, రెండు నిముషాలు కలుపుకుని, తగినన్ని నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి
6.సూప్ బాగా మరిగిన తర్వాత , అందులోకి పచ్చి కొబ్బరి తురుము, మిరియాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
7.ఇప్పుడు రుబ్బుకున్న మినపప్పు పిండితో బోండాలు వేసుకుని, రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని, బోండాలను సూప్ లో వేసుకోవాలి.
8.ఐదు నిముషాల తర్వాత బోండాలను సూప్ తో పాటు సెర్వ్ చేసుకుంటే, వేడ వేడి బోండా సూప్ రెడీ.