Beauty Tips

Yellow teeth:ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి

Yellow teeth:ఎంతటి గార పట్టిన పసుపు పళ్ళు అయినా 5 నిమిషాల్లో తెల్లగా ముత్యాల్లా మెరిసిపోతాయి.. కొంత మంది దంతాలు ఎంత శుభ్రం చేసిన సరే పసుపు రంగులోకి మారతాయి. అలాగే గార పడుతూ ఉంటాయి.

ఈ సమస్యను తగ్గించుకోవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితాన్ని ఇవ్వవు. దాంతో నిరాశ చెంది మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అవి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి.

అదే ఇంటి చిట్కాలు అయితే పంటి మీద పసుపు,గార శాశ్వతంగా తొలగిపోతాయి. పంటి మీద గార,పసుపు రంగు ఉంటే నలుగురిలో మాట్లాడాలన్న చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ కాఫీ పొడి,అరస్పూన్ ఆలివ్ ఆయిల్,ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమాన్ని బ్రష్ సాయంతో పళ్లను రెండు నిమిషాల పాటు రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే క్రమంగా పంటి మీద గార,పసుపు రంగు తొలగిపోతాయి. దంతాలను తెల్లగా మార్చటానికి కాఫీ పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

పళ్లను తెల్లగా మార్చుకోవటానికి ఖరీదైన క్రీమ్స్ వాడవలసిన అవసరం లేదు. కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పళ్లను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.