Beauty Tips

White Teeth:ఇలా చేస్తే చాలు 5 నిమిషాల్లో పళ్లపై ఉన్న గార,పసుపు పోయి తెల్లగా మెరుస్తాయి

White Teeth:ఇలా చేస్తే చాలు 5 నిమిషాల్లో పళ్లపై ఉన్న గార,పసుపు పోయి తెల్లగా మెరుస్తాయి.. దంతాలు తెల్లగా మెరవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ చాలా మంది దంతాలు గార పట్టి పసుపుపచ్చగా మారతాయి.

ఇలా మారిన దంతాలను తెల్లగా మార్చుకోవటానికి వేల కొద్ది డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాలతో దంతాలను తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు. దంతాలను తెల్లగా మార్చుకోవటానికి అరటి పండు తొక్క బాగా సహాయపడుతుంది.

అరటి పండు తిని తొక్క పాడేస్తూ ఉంటాం. అలా పాడెసే తొక్కలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అర‌టి పండు తొక్క‌ల‌తో దంతాల‌పై రుద్ద‌డం వ‌ల్ల గార,పసుపు రంగు పోయి మెరుస్తూ ఉంటాయి. దంతాలు, చిగుళ్లు దృఢంగా మారటమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.

ప్రతి రోజు 10 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేస్తే దంతాలు తెల్లగా మెరుస్తాయి. ఆయిల్ పుల్లింగ్‌కు నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె రెండింటిలో ఏదైనా ఉపయోగించవచ్చు. ఒక స్పూన్ నూనెను నోటిలో పోసుకొని 10 నిమిషాల పాటు నూనెను నోరు మొత్తం క‌లియ‌దిప్పుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పుల్లింగ్ చేయాలి.

ఈ రెండు చిట్కాలను ఫాలో అయితే గార,పసుపు పచ్చగా ఉన్న దంతాలు తెల్లగా మెరుస్తాయి. కాకపోతే కాస్త ఓపికగా చేసుకోవాలి. ఇలా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దంతాలు తెల్లగా మారటమే కాకుండా దంతాలు,చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చాలా తక్కువ ఖర్చు అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.