Beauty Tips

Hair Care Tips:ఇది వాడితే మీ జుట్టు ఒక్క వెంట్రుక కూడా రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair Care Tips:ఇది వాడితే మీ జుట్టు ఒక్క వెంట్రుక కూడా రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.. ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.

ముఖ్యంగా జుట్టుకి సంబందించిన సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి పలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా జుట్టు రాలే సమస్యను తగ్గించటమే కాకుండా చుండ్రు కూడా లేకుండా చేస్తుంది.

ఈ రోజుల్లో మారిన జీవన శైలి, ఒత్తిడి, ఆందోళన వంటి కారణాలతో జుట్టు రాలే సమస్య ఎక్కువైంది.జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలామంది కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల నూనెలు కొని వేల కొద్ది డబ్బు ఖర్చు పెట్టేస్తుంటారు. మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే తక్కువ ఖర్చులో జుట్టు రాలే సమస్య ను తగ్గించుకోవచ్చు.

ఈ చిట్కా కోసం కేవలం మూడు ఇంగ్రిడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ మూడు ఇంగ్రిడియంట్స్ మనకి సులభంగా ఇంటిలో అందుబాటులో ఉండేవి. కాస్త ఓపికగా ఈ రెమిడీ ని ఫాలో అవ్వాలి. రాత్రి సమయంలో రెండు స్పూన్ల మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ మెంతులను వడకట్టి నీటిని వేరు చేయాలి. నానిన మెంతులను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ కొబ్బరి నూనె కలిపి పక్కన పెట్టుకోవాలి.

ముందుగా మెంతులు నానిన నీటిని తీసుకొని జుట్టుకు పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి ఆ తర్వాత మెంతుల పేస్ట్ ని జుట్టుకు పట్టించి అరగంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది.

ఈ చిట్కాలో ఉపయోగించిన ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటమే కాకుండా జుట్టు కుడుళ్ళను బలోపేతం చేసి జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. కాబట్టి కాస్త ఓపికగా చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.