Kitchenvantalu

Carrot Coconut Burfi:కేవలం 10 నిమిషాల్లో కొత్తగా ఇలా కారెట్ కొబ్బరి బర్ఫీ చేయండి.. సూపర్ గా ఉంటుంది

Carrot Coconut Burfi:కేవలం 10 నిమిషాల్లో కొత్తగా ఇలా కారెట్ కొబ్బరి బర్ఫీ చేయండి.. సూపర్ గా ఉంటుంది.. క్యారెట్,కొబ్బరి రెండింటిలోను ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ స్వీట్ చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికి నచ్చుతుంది.

కావలసిన పదార్ధాలు
క్యారెట్ తురుము – 1 కప్పు
కొబ్బరి తురుము – 1 కప్పు
యాలకుల పొడి – 1 tsp
బాదం, పిస్తా – 2 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు – 1 చిటికెడు
చక్కెర – 1 కప్పు
నీరు – 1/4 కప్పు
నెయ్యి – 5 టేబుల్ స్పూన్లు

తయారి విధానం
ట్రేలో నెయ్యితో గ్రీజ్ చేసి పక్కన పెట్టండి. పాన్ లో 2 స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక క్యారెట్ తురుము,కొబ్బరి తురుము వేసి మూడు నిమిషాలు వేగించాలి. ఆ తర్వాత మరొక పాన్ లో పంచదార మరియు నీటిని పోసి తీగ పాకం వచ్చాక.. వేగించిన క్యారెట్,కొబ్బరి తురుము వేయాలి.

ఈ మిశ్రమం బాగా దగ్గరకి వచ్చాక యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలోకి మార్చండి. ఆ తర్వాత బాదం, పిస్తా, కుంకుమపువ్వు చల్లుకోండి.

బాగా చల్లారిన తర్వాత కావలసిన ఆకారాలలో కట్ చేసుకోండి. గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచితే దాదాపుగా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.