Kitchenvantalu

Onion Parata: కేవలం 10 నిమిషాల్లో నోరూరించే కమ్మని ఉల్లిపాయ పరోటా

Onion Parata: కేవలం 10 నిమిషాల్లో నోరూరించే కమ్మని ఉల్లిపాయ పరోటా.. పరాటా అనగానే బంగాళదుంప స్టఫ్ తో చేసేస్తుంటాం. కాని ఉల్లిపాయతో స్టఫ్ చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది. అందరి కిచెన్స్ లో కంపల్సరీగా కనిపించే ఉల్లి టేస్ట్ ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది.

కావాల్సిన పదార్ధాలు
పిండి కలపడం కోసం..
గోధుమ పిండి – 1.5 కప్పు
వాము – 2 చిటికెలు
ఉప్పు – కొద్దిగా
నూనె – 1 టీ స్పూన్
నీళ్లు – తగినన్ని
ఉల్లి మసాల కోసం..
ఉల్లితరుగు – 1 కప్పు
పచ్చిమిర్చి తురుము – ½ టీ స్పూన్
అల్లం తురుము – ½ టీ స్పూన్
ఉప్పు – తగినంత
కారం -1/2 టీ స్పూన్
చాట్ మసాలా – ½ టీ స్పూన్
నిమ్మరసం – ½ టీ స్పూన్
పల్చటి అటుకులు – ¼ కప్పు
పరాటాలు కాల్చడం కోసం..
నూనే లేదా నెయ్యి – తగినంత

తయారీ విధానం
1.గోధుమ పిండి, వాము ,ఉప్పు ,నూనె వేసి ముందు కలుపుకోవాలి.తర్వాత తగినన్ని నీళ్లు యాడ్ చేసుకుంటు మెత్తని ముద్దలా కలుపుకోవాలి.
2.కలుపుకున్న పిండిని సమంగా ఉండలు చేసి తడిగుడ్డతో కవర్ చేసి అరగంట పాటు నాననివ్వాలి.
3.ఇప్పుడు ఉల్లిపాయ మసాలా కోసం తీసుకున్న పదార్ధాలన్ని కలిపి పక్కనపెట్టుకోవాలి.
4.నానిన పిండి ముద్దని తీసుకోని చేత్తో కాస్తా పల్చగా వత్తుకొని అందులో ఉల్లి మసాలను స్టఫ్ చేసి అంచులను మూసి ప్యాక్ చేసుకోవాలి.

5.తరువాత పొడి పిండి చల్లుకుంటు..చపాతి కర్రతో నెమ్మదిగా స్టఫ్ బయటికి రాకుండా తాల్చుకోవాలి.
6.స్టవ్ పై పెనం పెట్టుకోని బాగా వేడెక్కనివ్వాలి.
7.వేడెక్కిన పెనం పై తాల్చుకున్న ఉల్లి పరాటాలను వేసి ఒక వైపు కాలనివ్వాలి.
8.ఇప్పుడు రెండో వైపుకు తిప్పుకొని నూనె కాని,నెయ్యి కాని అప్లై చేసుకుని రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే ఉల్లి పరాటా రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News