Beauty Tips

Aloe Vera Benefits: కలబందతో ఇలా చేశారంటే.. మీ జుట్టు వద్దన్నా.. పెరుగుతూనే ఉంటుంది!!

Aloe Vera Benefits: కలబందతో ఇలా చేశారంటే.. మీ జుట్టు వద్దన్నా.. పెరుగుతూనే ఉంటుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోకపోవటం వలన మనలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయట పడటానికి ఎన్నో రకాల నూనెలను ఉపయోగించిన పెద్దగా ఫలితం లేక చాలా నిరుత్సాహనికి గురి అవుతూ ఉంటారు.

అలాంటి వారి కోసం ఇప్పుడు చెప్పే నూనె చాలా బాగా పనిచేస్తుంది. కలబందను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేయాలి. మిక్సీ చేసినప్పుడు నీటిని పోయకుండా అవసరం అయితే కొబ్బరి నూనె పోయాలి. కలబంద పేస్ట్ ఒక కప్పు వచ్చేలా చేసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి దానిలో కలబంద గుజ్జు వేసి దానిలో పావుకేజీ కొబ్బరి నూనె పోయాలి.

ఆ తర్వాత గుప్పెడు మందార ఆకులు, ఒక స్పూన్ మెంతులు వేసి బాగా మరిగించాలి. మందార ఆకులు,కలబంద మిశ్రమం బాగా వేగి నూనె బయటకు వచ్చేవరకు మరిగించాలి. ఈ నూనెను వడకట్టి సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజు కొబ్బరి నూనె ఎలా రాసుకుంటామో అలాగే రాసుకోవచ్చు.

అలా కాకుండా రాత్రి సమయంలో రాసుకొని తలకు cap పెట్టుకోవచ్చు. మరుసటి రోజు ఉదయం అవసరం అయితే తలస్నానం చేయవచ్చు. ఈ విధంగా 15 రోజులపాటు ఈ నూనెను రాస్తే మంచి ఫలితం వస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.