DevotionalToday Rasi Phalalu In telugu

April Month horoscope:ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…మీ రాశి ఉందా…?

April Month horoscope:ఏప్రిల్ నెలలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారం…మీ రాశి ఉందా… అన్నింటికీ డబ్బే మూలం కాదు. చాలావరకూ మనసుకి సంబంధించిన అంశాలుంటాయి. డబ్బు లేకున్నా , ఏమీ లేకున్నా సరే, ఎంతో ఆనందంగా జీవించేవాళ్ళు కోట్లమంది ఉన్నారు.

అయితే కొత్త సంవత్సరం వచ్చిందంటే, మన జీవితం ఎలా ఉంటుందో, కష్టాలు గట్టెక్కుతాయా ఇలా రకరకాలుగా జ్యోతిష్యం ప్రకారం చూసుకునేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అయితే కొన్ని రాసులవారికి ఈ ఏడాది ఏప్రిల్ లో చాలా బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది.

వాటి వివరాల్లోకి వెళ్తే.. అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వాళ్ళు మేష రాశిలోకి వస్తారు. ఈరాశి వారికి తమ జీవితం అంటే విపరీతమైన ప్రేమ. జీవితం ఒక్కటే… దాన్ని చక్కగా జీవించు అనే ఫార్ములా బాగా విశ్వసించి ఫాలో అవుతారు.

వాస్తవాలకు దగ్గరగా, ఊహలకు దూరంగా ఉండడంవల్ల ప్రతి నిమిషాన్నీ వాస్తవంగా చూస్తూ, ఉన్నంతలో తృప్తిగా గడిపేస్తూ చాలా ధైర్యవంతులుగా, సాహసవంతులుగా చురుకుగాఉంటారు. జీవితంలో ప్రతి అంశాన్నీ ఇలాగే స్వీకరిస్తారు. కొత్తగా ఏదైనా చెయ్యడానికి వెనకాడరు. అందుకే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు.

ఇక కృత్తిక 2,3,4 పాదాలు అలాగే రోహిణి, మృగశిర 1,2 పాదాలు వృషభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారు పూర్తిగా పాజిటివ్‌గా ఉంటూ, నెగెటివ్ ఫీలింగ్స్ మనసులోకి రానివ్వరు. ఏం చేసినా… అది తప్పక పూర్తవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉంటారు.

చేసే పని ఎంత కాలం సాగినా, నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోరు. ఆ ఆశ ఎప్పుడూ యాక్టివ్‌గా, సంతోషంగా ఉంచుతుంది. ప్రతీ క్షణాన్నీ జాగ్రత్తగా వాడు కుంటున్నట్లు ఫీలవ్వడంవల్ల వీరికి నిరాశ, నిస్పృహ దరిచేరవు. భలే అదృష్టవంతు లు అని అనుకునేలా కనిపిస్తారు.

ఇక మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం వాళ్ళు సింహ రాశి లోకి వస్తారు. ఈరాశి వారు ఎలాంటి పరిస్థితులనైనా సంతోషంగా ఎలా మార్చుకోవాలో బాగా తెలిసి ఉంటారు. పైగా వీళ్లు జీవితాన్ని ప్రతి రోజూ పండగలా జరుపుకోవాలనుకుంటారు. ప్రతి నిమిషమూ అదే ఎంజాయ్ తో ఉంటారు. సాధ్యం కానివి ఏవీ ఊహించుకోరు. ఉన్న పరిస్థితుల్లోనే అలాంటి ఆనందాన్ని పొందగలరు. అన్నింటా ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉంటారు.

చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలకు చెందినవాళ్లు తుల రాశిలోకి వస్తారు. ఈరాశి వారికి జీవితాన్ని ఎలా అనుభవించాలో తెలుసు. పాటలు పాడ గలరు, డాన్స్ చేయగలరు. అయితే తమలో టాలెంట్ ఎవరో గుర్తించాలని అనుకో కుండా, వీళ్లకు వీళ్లే తమ టాలెంట్ బయటపెట్టుకుంటూ తృప్తిగా ఉంటారు. అన్నింటా ఉత్తమమైన మార్గం వెతుక్కుంటూ, దాన్ని సాధించి, సంతోషంగా ఉంటారు.

కాగా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ధనస్సు రాశిలోకి వస్తారు. జీవితం ఒక్కటే… దాన్ని జీవించాల్సిందే అనే కర్మ సిద్ధాంతాన్ని 100 శాతం పాటిస్తూ, ప్రతి రోజు ఓ సాహసంలా ఉండాలనుకుంటారు. ఎప్పటికప్పుడే కొత్త దనం కోరుకుంటూ, నిరాశాపూరిత రోజులో కూడా సంతోషంగా ఉంటారు. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతోషాలను వెతుక్కుంటూ జీవనం సాగిస్తారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.