Healthhealth tips in telugu

Thigh Pain:కాలి పిక్క‌లు, కండ‌రాలు పట్టేస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..! స‌మ‌స్య పోతుంది..!

Thigh Pain Home remedies in telugu : కాలి పిక్క‌లు, కండ‌రాలు పట్టేస్తున్నాయా..? అయితే ఇలా చేయండి..! స‌మ‌స్య పోతుంది..మనలో చాలా మంది కాళ్ళు నొప్పి, పిక్కలు పట్టేయడం వంటి సమస్యలతో అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు.

మోకాలు దిగువ భాగంలో కాళ్లకు వెనకవైపు ఉండే బలమైన కండరాలు.ను పిక్కలు అని అంటారు. సాధారణంగా ఎక్కువ మందికి రాత్రి సమయంలో పిక్కలు పట్టేయడం లేదా విపరీతమైన నొప్పి రావడం జరుగుతూ ఉంటుంది.

ఈ నొప్పి ఒక్కోసారి భరించలేని విధంగా కూడా ఉంటుంది. నొప్పి రావడానికి ఎక్కువ శ్రమ చేసేవారు., ఎక్కువ సేపు నిలబడటం, నడవటం,ఒకే చోట కదలకుండా కూర్చోవడం, రక్తనాళాల్లో అవరోధాలు, నరాల మీద ఒత్తిడి వంటివి కారణాలుగా చెప్పవచ్చు. మెగ్నిషియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి.

ఈ నొప్పులు వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. నొప్పి ఉన్న ప్రదేశంలో ఐస్ అద్దుతూ కాపడం పెట్టాలి. దీనివల్ల నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే రాత్రి పడుకున్నప్పుడు కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుని కాళ్లు ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. కాళ్లు బాగా .చాచి అటూ ఇటూ కదుపుతూ తేలికపాటి వ్యాయామాలు చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. అంటే పాలకూర., గుమ్మడికాయ విత్తనాలు, బాదం పప్పు, పెరుగు, ఆకుకూరలు వంటి వాటిని తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఆనపకాయ,బూడిద గుమ్మడికాయ నొప్పులకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇలాంటి నొప్పులు రావడానికి రక్తహీనత కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి రక్తహీనత సమస్య ఉందేమో ఒకసారి పరీక్ష చేయించుకోవాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.