Beauty Tips

Hair care Tips:5 నిముషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నాఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair care Tips:5 నిముషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నాఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.. ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందికి జుట్టు రాలే సమస్య వస్తోంది. కొంత మందికి అయితే బట్టతల వచ్చేస్తోంది. ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.

జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది. జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు… కాబట్టి ప్రతి ఒక్కరు జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజీ పొడిని తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్ మరియు ఒక విటమిన్ e క్యాప్సిల్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే క్రమంగా జుట్టు రాలే సమస్య, చుండ్రు వంటి అన్నీ సమస్యలు తొలగిపోతాయి.

కలోంజి గింజలు జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి. ఒకప్పుడు చాలా అరుదుగా లభించేవి. కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్స్, ఆయుర్వేదం Shops, Online Stores లో చాలా విరివిగా లభ్యం అవుతున్నాయి. యాంటీ వైరల్ మరియు యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండుట వలన చుండ్రును తగ్గించి జుట్టును రాలకుండా చేస్తుంది.

కలబంద జెల్ అనేక ఔషధ గుణాలను కలిగి ఉండుట వలన జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. ఇందులో అధిక తేమ ఉంటుంది, జుట్టును మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా కలబందలో ఉండే అనేక విటమిన్లు, మినరల్స్, ఎంజైములు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పొడవుగా, దృఢంగా ఉండేలా చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.