Beauty Tips

Skin Glow Tips:ఈ పేస్ట్ ముఖానికి రాస్తే 1500 పెట్టినా రాని గ్లో 10 రూపాయిలతో వస్తుంది…

Skin Glow Tips:ఈ పేస్ట్ ముఖానికి రాస్తే 1500 పెట్టినా రాని గ్లో 10 రూపాయిలతో వస్తుంది… చర్మం మీద సన్ టాన్, జిడ్డు, మురికి పేరుకుపోవడం వలన ముఖం బాగా నల్లగా కనబడుతుంది. వీటిని తొలగించుకోవడానికి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగితే దాదాపుగా 1500 రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. కానీ చాలా తక్కువ ఖర్చులో చాలా సులభంగా ఇంట్లో ఉన్న సహజ సిద్ధమైన పదార్థాలతో చర్మాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

ఒక బంగాళదుంపని తీసుకుని పై తొక్క తీసి తురుముకోవాలి. బంగాళదుంప తురుమును పలుచని వస్త్రం సాయంతో జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ ని 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పది నిమిషాల తర్వాత పైన ఉన్న వాటర్ ని తీసేస్తే గిన్నె అడుగున పిండి పదార్థం ఉంటుంది. బంగాళదుంప నాచురల్ బ్లీచింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది.

ఆ తర్వాత ఒక స్పూన్ multani mitti వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మూలేటి పౌడర్ వేయాలి. అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవటం వలన సన్ టాన్, మురికి,జిడ్డు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

multani mitti ముఖాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది. చర్మంపై సన్ టాన్, మురికిని తొలగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆయిల్ స్కిన్ లో ఏర్పడే బ్లేమిషెస్ తొలగించడానికి కూడా ఇది బాగా ఉపయోగ పడుతుంది. నిమ్మ కాయలో ఫ్రూట్ యాసిడ్స్ ఉంటాయి. ఇది మృత చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. చర్మంలోని మురికి, జిడ్డును తొలగించడంలో సహాయపడుతుంది. ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో సహజసిద్దమైన పదార్ధాల్తో తయారుచేసిన ఈ ప్యాక్ వేసుకొని తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండీ.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.