Beauty Tips

Face Glow Tips:పసుపులో ఈ రెండింటిని కలిపి రాస్తే ముఖం మీద మచ్చలు లేకుండా తెల్లగా మెరిసిపోతుంది

Face Glow Tips:పసుపులో ఈ రెండింటిని కలిపి రాస్తే ముఖం మీద మచ్చలు లేకుండా తెల్లగా మెరిసిపోతుంది.. ఎండ, కాలుష్యం కారణంగా ముఖం జిడ్డుగా, నల్లగా మారుతూ ఉంటుంది. అలాంటి ముఖాన్ని అందంగా జిడ్డు లేకుండా ఎలా చేసుకోవాలో ఈ రోజు ఒక చిట్కా ద్వారా తెలుసుకుందాం. ఈ చిట్కా చర్మంపై జిడ్డును తొలగించటమే కాకుండా చర్మంపై ఉన్న మృత కణాలను కూడా సమర్ధవంతంగా తొలగిస్తుంది.

ఇప్పుడు చెప్పబోయే పేస్ ప్యాక్ ముఖాన్ని పెయిర్ గా కాంతివంతంగా మారుస్తుంది. ఈ పేస్ ప్యాక్ కోసం మూడు ఇంగ్రిడియన్స్ సరిపోతాయి. అవన్నీ మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే.

పసుపు
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మానికి చాలా మంచి చేస్తాయి. పసుపు ముఖంపై ఉండే బ్యాక్టీరియాను తొలగించి మొటిమలు రాకుండా చేస్తుంది.

నిమ్మరసం
నిమ్మరసంలో సిట్రిక్ ఆమ్లం,విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన చర్మంపై పెరుకుపోయిన జిడ్డు,టాన్ ని సమర్ధవంతంగా తొలగిస్తుంది. ముఖాన్ని తాజాగా కాంతివంతంగా చేస్తుంది. బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన ముఖం మీద మచ్చలు లేకుండా మెరిసేలా చేస్తుంది.

పెరుగు
పెరుగు చర్మంపై ఉన్న టాన్,నలుపును తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాక ముఖం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. ఆయిల్ స్కిన్ వారు అయితే మీగడ లేని పెరుగును తీసుకోవాలి.

ఒక బౌల్ లో చిటికెడు పసుపు,ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి. ఈ మూడు ఇంగ్రిడియన్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక సాదరణమైన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయటం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.