Beauty Tips

Hair Care Tips:పెరుగులో ఈ పొడి కలిపి తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య అసలు ఉండవు

Hair Care Tips:పెరుగులో ఈ పొడి కలిపి తలకు పట్టిస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య అసలు ఉండవు.. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా మనలో చాలామంది చుండ్రు, జుట్టు రాలే సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. .

ఈ సమస్యల పరిష్కారానికి పెరుగు చాలా బాగా సహాయపడుతుంది. పెరుగులో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మనం ప్రతిరోజు ఇంటిలో పెరుగు వాడుతూనే ఉంటాం. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

ఒక కప్పు పెరుగు తీసుకుని దానిలో ఒక స్పూను వేప పొడిని వేయాలి. పెరుగు., వేప పొడి బాగా కలిసేలాగా కలపాలి. ఆ తర్వాత ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట అయ్యాక కుంకుడుకాయలతో తల స్నానం చేయాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టుకు అవసరమైన పోషణ అంది.జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. తల మీద చర్మం తేమగా ఉండి చుండ్రు సమస్య కూడా తగ్గటానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పెరుగులో విటమిన్ బి మరియు హెయిర్-ప్రోటీన్‌ సమృద్దిగా ఉండుట వలన జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.

వేపను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో వాడుతున్నారు. వేపలో ఉన్న పోషకాలు తల మీద దురద,ఇన్ ఫెక్షన్ తగ్గించటానికి సహాయ పడుతుంది. అలాగే పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలకుండా మృదువుగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కా ఫాలో అయ్యి జుట్టు సమస్యల నుండి బయట పడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.