Healthhealth tips in telugu

Carom seeds: వాము గింజల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా?

Carom seeds: వాము గింజల వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయని మీకు తెలుసా.. వామును పురాతన కాలం నుండి వంటింటి చిట్కాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కడుపు నొప్పి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నప్పుడూ కాస్త వాము,ఉప్పు కలిపి తినమని మన పెద్దవారు చెప్పటం వింటూ ఉంటాం. వామును అనేక మందుల తయారీలో వాడుతున్నారు. ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు.

వాము రుచిలో కాస్త ఘాటుగా ఉన్నా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఘాటు కారణంగా మనలో చాలా మంది వామును తినటానికి ఆసక్తి చూపరు. వాములో విట‌మిన్లు, ఖ‌నిజాలు, ఫైబ‌ర్, యాంటిఆక్సిడెంట్స్,విట‌మిన్ ఏ, సీ, ఈ, కే ల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్‌, పాస్ఫ‌ర‌స్ వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.

వాములో ఉండే థైమిన్ అనే రసాయనం యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసి మన శరీరానికి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. అయితే సరైన మోతాదులో తీసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు, అదే మోతాదుకి మించి తీసుకుంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే ప్రయోజనాలు కలుగుతాయి.

గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వామును ఎక్కువగా తీసుకుంటే యాసిడ్ రిఫ్ల‌క్స్, గ్యాస్ వంటి స‌మ‌స్య‌లు పెరిగే అవకాశం ఉంది. వామును డైరెక్ట్ గా ఎక్కువగా తీసుకుంటే నోటిలో మంట‌, పుండ్లు అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నవారు కూడా తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎల‌ర్జీ ఉన్నవారు వాముకి దూరంగా ఉంటేనే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.