Healthhealth tips in telugu

Kidney Stones:కిడ్నీలో రాళ్లు ఉన్నాయా… వాముతో ఇలా చేస్తే సరి

Kidney Stones:కిడ్నీలో రాళ్లు ఉన్నాయా… వాముతో ఇలా చేస్తే సరి.. ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. జీవనశైలి పరిస్థితులు మారిపోవడం నీటిని సరిగ్గా తాగకపోవటం ఉప్పు ఎక్కువగా తీసుకోవడం అధిక బరువు వంటి కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి.

అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది. కిడ్నీలో రాళ్లు సమస్యలు తొందరగా నివారించుకోవాలి లేకపోతే అది ఆపరేషన్ వరకు వెళుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నప్పుడు మందులు వాడుతూ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించడానికి మన వంటింట్లో ఉండే వాము చాలా పర్ఫెక్టుగా పని చేస్తుంది వాములో యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ మినరల్స్ ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాము ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది అయితే కిడ్నీలో రాళ్ల సమస్యకు వాముని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఒక గ్లాస్ నీటిలోవాము వేసి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడగట్టి అర స్పూన్ తేనె కలిపి తాగాలి

ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే కిడ్నీలో రాళ్లు క్రమంగా కరుగుతాయి. అలాగే వామును మరొక విధంగా కూడా తీసుకోవచ్చు వామును డ్రై రోస్ట్ చేసి పౌడర్ గా చేసుకుని పెట్టుకోవాలి ఒక గ్లాస్ మజ్జిగలో పావు టీ స్పూను వాము పొడిని కలుపుకుని తాగాలి. ఇప్పుడు చెప్పిన ఈ రెండు రెమిడీ లలో ఏది ఉపయోగించిన మంచి ప్రయోజనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.