Healthhealth tips in telugu

Hiccups: ఎక్కిళ్ళు అదే పనిగా వస్తున్నాయా…ఈ టిప్స్ మీకోసమే..

Hiccups: ఎక్కిళ్ళు అదే పనిగా వస్తున్నాయా…ఈ టిప్స్ మీకోసమే.. ఒక్కోసారి కొందరికి అదేపనిగా ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో మనకే కాదు పక్కన ఉన్నవారికి కూడా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే తరచూ వచ్చే ఎక్కిళ్ళను ఇంటిలో సులభంగా అందుబాటులో దొరికే వస్తువులతో ట్రై చేయవచ్చు.

అల్లం : చాలా మంది అల్లాన్ని వంటల్లో వేస్తారు కానీ తినటానికి ఇష్టపడరు. కానీ అల్లాన్ని సన్నని ముక్కలుగా కోసి ఎక్కిళ్ళు వచ్చినప్పుడు బుగ్గలో పెట్టుకొని చప్పరించాలి. ఇలా చేయుట వలన ఎక్కిళ్ళు తొందరగా ఆగిపోతాయి.

యాలకులు : ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ యాలకుల పొడి వేసి మరిగించాలి. ఈ నీటిని వడకట్టి త్రాగాలి. ఈ నీటి వల్ల గొంతు,శ్వాస వ్యవస్థలు ఉత్తేజితమై ఎక్కిళ్ళు తగ్గిపోతాయి.

ఆవాలు : చిటికెడు ఆవాల పొడిలో అరస్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తినాలి. ఈ విధంగా చేస్తే ఎక్కిళ్ళు త్వరగా ఆగిపోతాయి.

వెనిగర్ : ఎక్కిళ్ళు వచ్చినప్పుడు రెండు చుక్కల వెనిగర్ ని నాలిక మీద వేసుకుని చప్పరిస్తే, ఆ పుల్లదనానికి వెంటనే ఎక్కిళ్ళు ఆగిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.