Healthhealth tips in telugu

Tella Galijeru:పొలాలో గట్లపై పెరిగే ఈ మొక్క.. అనేక రోగాల నివారిణీ.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు

Tella Galijeru:పొలాలో గట్లపై పెరిగే ఈ మొక్క.. అనేక రోగాల నివారిణీ.. ఎక్క‌డ క‌నిపించినా వ‌ద‌లొద్దు.. పునర్నవ లేదా తెల్ల గలిజేరు గా పిలిచే ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కల కనబడుతుంది. కానీ ఈ మొక్క ఉన్న ప్రయోజనాలు గురించి మనకు తెలియక ఏదో పిచ్చి మొక్క అని భావిస్తాం. కానీ మన చుట్టుపక్కల ఉండే ఎన్నో రకాల మొక్కలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

పునర్నవ అంటే శరీరాన్ని చైతన్యం నింపేది అని అర్థం.ఈ మొక్కలలో ప్రోటీన్స్, విటమిన్ సి, సోడియం, ఐరన్, కాల్షియం వంటి ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.పునర్నవలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్లు మరియు కండరాల నొప్పి తగ్గించడానికి సహాయ పడుతుంది.

జీర్ణ రసాల స్రావాన్ని ప్రేరేపిస్తాయి. జీర్ణప్రక్రియలో పోషకాలను గ్రహించడానికి జీర్ణక్రియను పెంచడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. కిడ్నీ సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన, మూత్రపిండాల్లో రాళ్ళు బాధాకరమైన మూత్రవిసర్జన అలాగే కిడ్నీ లకు సంబంధించి అన్ని రకాల సమస్యలను నివారించడంలో పునర్నవ కీలకమైన పాత్రను పోషిస్తుంది.

శక్తివంతమైన బయో యాక్టివ్ భాగాలు ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.గుండె కండరాలను బలోపేతం చేయడమే కాకుండా లిపిడ్ నిర్మాణాన్ని నివారించి గుండె పోటు రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాలేయానికి సంబంధించిన సమస్యలు తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.