Telugu Kitchen Tips:ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు
Useful Kitchen Tips in telugu: ఇల్లాలికి ఉపయోగపడే కొన్ని సులభమైన వంటింటి చిట్కాలు
కందిపప్పు ఒక్కోసారి తొందరగా ఉడకదు. అలాంటి సమయంలో పప్పు ఉడికించినప్పుడు ఒక టీ స్పూన్ నువ్వుల నూనె వేస్తే పప్పు మెత్తగా ఉడకటమే కాకుండా మంచి రుచిగా ఉంటుంది.
బ్రెడ్ మెత్తగా ఉండి ముక్కలుగా కోయటానికి కష్టంగా ఉంటే… చాకును మంట దగ్గరగా పెట్టి వేడి చేసి బ్రెడ్ ని ముక్కలుగా కట్ చేస్తే చాలా తొందరగా కట్ అవుతుంది.
ఈగలు వచ్చాయంటే ఒక పట్టాన వదలవు ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ఈగలు చాలా సులభంగా బయటకు పోతాయి. డైనింగ్ టేబుల్ మీద నాలుగు కరివేపాకు రెమ్మలను పడితే ఈగలు కరివేపాకు వాసనకు ఆ చుట్టుపక్కలకు రాకుండా ఉంటాయి.
సాధారణంగా మనం కూరలు చేసినప్పుడు ఒక్కోసారి ఉప్పు ఎక్కువగా పడిపోతుంది. అలాంటి సమయంలో ఉడికించిన బంగాళదుంపను కలిపితే సరిపోతుంది.
గారెల పిండి నూనెలో వేయగానే విడిపోతుంటే పిండిలో ఒక టేబుల్ స్పూను నెయ్యి కలిపితే సరిపోతుంది.


