Healthhealth tips in telugu

Curry Leaves:5 ఆకులతో ఇలా చేస్తే చాలు కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులకు మందుగా పనిచేస్తుంది

Curry Leaves:5 ఆకులతో ఇలా చేస్తే చాలు కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని వ్యాధులకు మందుగా పనిచేస్తుంది.. రూటేసి కుటుంబానికి చెందిన కరివేపాకు గురించి మనలో చాలా మందికి తెలుసు. మనం ప్రతి రోజు కూరల్లో వేసుకుంటాం. పూర్వ కాలం నుండి కరివేపాకును వాడుతూ ఉన్నారు.

కరివేపాకు వలన వంటలకు మంచి రుచి,వాసన రావటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. అయితే చాలా మంది కరివేపాకు కాస్త చేదు రుచిని కలిగి ఉండటం వలన తినటానికి ఇష్టపడరు.

అలాగే కూరల్లో కరివేపాకును ఏరి పారేస్తూ ఉంటారు. కరివేపాకులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం కరివేపాకు పాడేయకుండా తినటానికి ప్రయత్నం చేస్తారు.కరివేపాకు మనకు లభించడం మన అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే కరివేపాకులో ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

కరివేపాకులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన ఆక్సీకరణ నష్టం వలన నాడీ వ్యవస్థ, గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడటం కిడ్నీ సమస్యలు లేకుండా చేస్తుంది.కరివేపాకులో యాంటీ మ్యూటాజెనిక్ సామర్ధ్యం కలిగి ఉండటం వలన మన శరీరం క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. కరివేపాకులోని ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ నిరోధక కారకాలుగా పనిచేస్తాయి.

రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో ఇవి ప్రభావవంతంగా ఉంటాయి.అలాగే పెద్ద ప్రేగు క్యాన్సర్,గర్భాశయ క్యాన్సర్ నుండి రక్షించటంలో సహాయపడుతుంది. కరివేపాకు ఆక్సీకరణ నష్టాన్ని నివారించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కరివేపాకు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి . ముఖ్యంగా ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

కరివేపాకులో మహానింబైన్ అని పిలువబడే ఆల్కలాయిడ్ అధికంగా ఉండటం గుండెకు ఎంతో మేలు చేస్తుంది మరియు గుండె జబ్బులకు చికిత్స చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.