Kitchenvantalu

Pudina Kothimeera Pachadi:పుదీనా కొత్తిమీర పచ్చడి ఈ tips తో చేస్తే రుచి చాలా బాగుంటుంది

Pudina Kothimeera Pachadi:పుదీనా కొత్తిమీర పచ్చడి ఈ tips తో చేస్తే రుచి చాలా బాగుంటుంది.. పుదీనా,కొత్తిమీరలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో ఇలా పచ్చడి చేసుకొని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. పుదీనా వాసన నచ్చని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్దాలు :
టొమాటోలు – 4
శుభ్రపరిచిన కొత్తిమీర – అర కప్పు
పుదీనా – పావు కట్ట
మినప్పప్పు – అర టీస్పూన్
జీలకర్ర – పావు టీ స్పూన్
పచ్చిమిర్చి – 2
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – టేబుల్ స్పూన్

పోపు కోసం:
నూనె – టీ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
ఎండుమిర్చి – 1
ఇంగువ – చిటికెడు
కరివేపాకు – రెండు రెబ్బలు

తయారి:
1. పాత్రలో రెండు టీ స్పూన్ల నూనె వేడయ్యాక, జీలకర్ర వేయించాలి. దీంట్లో మినప్పప్పు ఎరుపు రంగు వచ్చేలా వేయించి, పచ్చిమిర్చి, కొత్తిమీర , పుదీనా కలిపి 2 నిమిషాలు వేయించి తీయాలి.

2.అదే పాన్‌లో మిగతా నూనె వేడయ్యాక టొమాటో ముక్కలు వేసి 8 నిమిషాలు వేయించి తీసి చల్లార్చాలి.

3.ముందుగా మినప్పప్పు మిశ్రమం గ్రైండ్ చేసి తరవాత వేయించిన టొమాటో ముక్కలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసి పాత్రలోకి తీయాలి.

4.పాత్రలో టీ స్పూన్ నూనె వేడయ్యాక ఆవాలు చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి చివరగా ఇంగువ కలిపి తీసి వెంటనే పచ్చడి మిశ్రమంలో కలపాలి.