Healthhealth tips in telugu

Mango:వేసవిలో మామిడి పండ్లు తప్పకుండా తినాలట, ఎందుకో తెలుసా?

Mango:వేసవిలో మామిడి పండ్లు తప్పకుండా తినాలట, ఎందుకో తెలుసా.. వేసవి కాలంలో మనకు లభించే పండ్లలో మామిడిపండు కూడా ఒకటి. ఈ సీజన్లో లభించే మామిడిపండు తప్పనిసరిగా తినాలి. మామిడి పండు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు అందరూ ఇష్టంగా తింటారు. అయితే కొంతమంది మామిడి పండ్లు తినడానికి ఇష్టపడరు.

మామిడి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మామిడిపండ్లను  ఇష్టంగా తింటారు. పండ్లలో రారాజు అయినా మామిడిపండును వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు. మామిడి పండు లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.ఇతర పండ్లతో పోలిస్తే మామిడిపండులో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ప్రపంచ వ్యాప్తంగా 20-30 రకాల మామిడి పండ్లున్నాయి. అయితే మన ఇండియాలో మామిడిలో ఎన్ని రకాలున్నా బంగినపల్లి రుచికి ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంటుంది.ఈ వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లను ఖచ్చితంగా తినాలి. ఏ సీజన్లో వచ్చే పండు ఆ సీజన్లో తింటే చాలా మంచిది. ఈ సీజన్లో వచ్చే మామిడి పండ్లను తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 

మామిడి పండులో ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్ ఎ, సి, బి6, ఇ ల‌తో పాటు కాపర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి పోష‌కాలు సమృద్ధిగా ఉంటాయి.  మామిడి పండులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది.  నారింజ తో పోలిస్తే మామిడి పండ్లలో  ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. నారింజలో విటమిన్ సి 70 మిల్లీ గ్రాములు ఉంటే, అదే మామిడి పండ్లలో  అయితే 122 మిల్లీ గ్రాములు  విటమిన్ సి ఉంటుంది. 

ఇందులో ఉండే జెక్సాంథిన్‌ అనే ప్రొటీన్‌ కంటికి మేలు చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మామిడి పండులో విటమిన్ ఏ చాలా సమృద్ధిగా ఉంటుంది ఒకరకంగా చెప్పాలంటే క్యారెట్ లో కన్నా మామిడిపండులో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మామిడి పండ్లలో ఉండే విటమిన్ ఏ సెబమ్ అనే ప్రోటీన్ ని ఉత్పత్తి చేసి జుట్టుకు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది.

అంతే కాకుండా విటమిన్ ఏ శరీరంలో చర్మ కణాలను  రక్షించటంలో కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. మామిడి పండులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు, గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రిస్తుంది. మామిడి పండులో ఉండే బి6 మెదడు పనితీరు బాగా  ఉండేలా చేయడమే కాకుండా మూడ్ సరిగా ఉండేలా చేస్తుంది. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.