Healthhealth tips in telugu

Weight Loss Drink:పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన మ్యాజిక్ డ్రింక్

Weight Loss Drink:పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వును కరిగించే అద్భుతమైన మ్యాజిక్ డ్రింక్.. ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరినీ అధిక బరువు సమస్య వేదిస్తుంది. ఆహారపు అలవాట్లలో మార్పులు,శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవటం,ఒత్తిడి వంటి అనేక కారణాలతో బరువు పెరుగుతున్నారు.

బరువు పెరిగినంత సులువు కాదు బరువు తగ్గటం. బరువు పెరగటం మరియు అధిక కొవ్వు కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల ఈ రోజు శరీరంలో పెరుకుపోయిన కొవ్వు,అధిక బరువు తగ్గించుకోవటానికి ఒక మంచి మ్యాజిక్ డ్రింక్ గురించి తెలుసుకుందాం. ఈ డ్రింక్ కోసం మూడు ఇంగ్రేడియన్స్ అవసరం అవుతాయి.

వాము
సొంపు
జీలకర్ర

వాము,సొంపు,జీలకర్ర శరీరంలో మెటబాలిజం రేటును పెంచటంలో సహాయపడతాయి. అంటే జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తాయి. మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి శరీరంలో వ్యర్ధాలు పెరుకుపోకుండా సహాయపడతాయి. అంతేకాక శరీరానికి హానికరంగా ఉండే టాక్సీన్స్ ని బయటకు పంపటంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది.

ఇప్పుడు ఈ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. వాము,సొంపు,జీలకర్ర మూడింటిని ఒకొక్క స్పూన్ చొప్పున తీసుకొని మెత్తని పొడిగా తయారుచేసుకోవాలి.ఒక గిన్నెలో కప్పున్నర నీటిని తీసుకొని దానిలో వాము,సొంపు,జీలకర్ర కలిపి చేసుకున్న పొడి ఒక స్పూన్ వేసుకొని బాగా కలిపి 5 నిమిషాల పాటు మరిగించి గ్లాస్ లోకి వడగట్టి గోరువెచ్చగా అయ్యాక త్రాగాలి.

ఈ డ్రింక్ ని క్రమం తప్పకుండా ప్రతి రోజు ఉదయం నెల రోజుల పాటు తీసుకుంటూ ఉంటే అధిక బరువు,శరీరంలో పెరుకుపోయిన కొవ్వు తగ్గిపోతాయి. ఈ డ్రింక్ ఉదయం పరగదుపున త్రాగితే మంచి ఫలితం ఉంటుంది. ఈ డ్రింక్ త్రాగిన గంట తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తే మంచిది. ఈ డ్రింక్ త్రాగటం వలన మలబద్దకం మరియు గ్యాస్,ఎసిడిటీ సమస్య, కడుపు ఉబ్బరం,తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాకపోవటం వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి.

వాము,సొంపు,జీలకర్ర మూడింటిని సమాన పరిమాణంలో తీసుకొని పొడి చేసుకొని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రతి రోజు ఈ డ్రింక్ త్రాగుతూ ఉంటే పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వు,అధిక బరువు సమస్య తొలగిపోతుంది. ఈ విధంగా 30 రోజులు త్రాగితే మీరు ఊహించని విధంగా బరువు తగ్గటాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.