Kitchenvantalu

Carrot Peanut fry:క్యారెట్ ప‌ల్లీల ఫ్రై ఎప్పుడైనా తిన్నారా.. చాలా రుచిగా ఉంటుంది…త‌యారీ ఇలా..!

Carrot Peanut fry Recipe:కంటికి మేలు చేసే క్యారెట్. వారంలో రెండు మూడు సార్లు అయినా, లంచ్ మెనూలో యాడ్ చేసుకోవాలి. మరీ ముఖ్యంగా, పిల్లలకి స్కూల్ బాక్స్ లో కనిపించాలి. పచ్చి క్యారెట్స్ తినడం ఇష్టపడని వారికి, క్యారెట్ రైస్ టేస్టీగా అనిపిస్తుంది. లంచ్ బాక్స్ ఒపెన్ చేయగానే తినాలనిపిస్తుంది.

కావాల్సిన పదార్దాలు
క్యారెట్ – ½ కిలో
పల్లీలు – ¼ కప్పు
ఎండుకొబ్బరి పొడి -¼ కప్పు
నువ్వులు -¼ కప్పు
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
పచ్చి శనగపప్పు – 1 టేబుల్ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
వెల్లుల్లి రెబ్బలు -7 – 8
కారం – 1 టేబుల్ స్పూన్
నూనె – 3 టేబుల్ స్పూన్
ఆవాలు – 1 టీ స్పూన్
కరివేపాకు – రెమ్మ
పసుపు – ½ టీ స్పూన్
కొత్తిమీర – కొద్దిగా

తయరీ విధానం
1. క్యారెట్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, నీరు పోసి స్టవ్ పై పెట్టుకుని ఉడికించుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకుని, అందులోకి పల్లిలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
3. వేయించుకున్న దినుసులకు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, యాడ్ చేసుకుని, బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అదే పాన్ లో, ఆయిల్ వేసి, ఆవాలు , కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి, అవి వేగాక, ఉడికించిన క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకోవాలి.
5. సుమారుగా 7 నుంచి 8 నిముషాల వేయించుకోవాలి.
6. క్యారెట్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీ పొడిని సగం కప్పు వేసి కొత్తిమీర చల్లుకోవాలి.
7. అంతే క్యారెట్ పల్లీ పొడి ఫ్రై రెడీ.
Click Here To Follow Chaipakodi On Google News