Beauty Tips

Hibiscus for Hair: మందార మొగ్గలను ఇందులో కలిపి రాస్తే జుట్టు ఊడటం ఆగి పొడవుగా పెరుగుతుంది

Hibiscus for Hair: మందార మొగ్గలను ఇందులో కలిపి రాస్తే జుట్టు ఊడటం ఆగి పొడవుగా పెరుగుతుంది.. మారిన పరిస్థితి కారణంగా జుట్టుకి సంబందించిన సమస్యలు చాలా ఎక్కువగానే వస్తున్నాయి. జుట్టు సంరక్షణలో మందార చాలా బాగా సహాయపడుతుంది. మందార పువ్వులు, ఆకులు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి సహాయపడతాయి. మందార మొక్క దాదాపుగా ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.

జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్ లో దొరికే ఎన్నో రకాల షాంపూలు,నూనెలను వాడుతూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటిలో సులభంగా దొరికే సహజసిద్దమైన పదార్ధాలను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

మూడు స్పూన్ల బియ్యాన్ని కడిగి నీటిని పోసి ఉడికించి ఆ నీటిని వడకట్టాలి. ఆ తర్వాత 4 మందార పువ్వులను రేకలుగా విడతీయాలి. 4 మందార ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మందార పువ్వులు దొరక్కపోతే మందార మొగ్గలను వాడవచ్చు. మందార పువ్వు రేకలను,ఆకులను కచ్చా పచ్చాగా దంచాలి.

ఒక సీసాలో గోరువెచ్చగా ఉన్న బియ్యం నీటిని పోయాలి. ఆ తర్వాత మందార మిశ్రమాన్ని వేసి బాగా కలిపి రెండు గంటలు అలా వదిలేయలి. ఆ తర్వాత ఈ నీటిని వడకట్టి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అయ్యాక సాదరణమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. మరుసటి రోజు జుట్టుకి నూనెను రాసి మసాజ్ చేయాలి.

ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా రెగ్యులర్ గా వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. మందార ఆకులు,పువ్వులు దాదాపుగా అందరికీ అందుబాటులో ఉంటాయి. గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఎర్ర మందార పువ్వులను మాత్రమే ఉపయోగించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.