Beauty Tips

Face Glow Tips:10 రూపాయిల ఖర్చుతో 10 నిమిషాల్లో ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది…

Face Glow Tips:10 రూపాయిల ఖర్చుతో 10 నిమిషాల్లో ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మారుతుంది… మనలో చాలా మంది ముఖం మీద నల్లని మచ్చలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరిసి పోవాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకడుగు వెయ్యరు. అలాగే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ సమయాన్ని కూడా వృదా చేసేస్తూ ఉంటారు.

చాలా తక్కువ ఖర్చుతో మన ఇంటిలో సులభంగా దొరికే వస్తువులతో ముఖం మీద మొటిమలు, మచ్చలు, నలుపు, మురికి, జిడ్డు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి వాటిని సులభంగా తగ్గించుకోవచ్చు. దీని కోసం మనం నాలుగు స్పూన్లు బియ్యంని తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీలో వేసి నీటిని పోస్తూ మెత్తగా చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని వడగట్టాలి. బియ్యం నీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ తొక్కలు తీసుకుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసు కోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాసు పాలను పోయాలి. పాలు బాగా మరిగాక నిమ్మ తొక్కల పేస్ట్ వేసి 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత తయారు చేసిపెట్టుకున్న రైస్ వాటర్ ని వేసి పదిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఇలా మరిగించటం వలన ఒక క్రీమ్ లా తయారవుతుంది. ఈ క్రీమ్ ని చల్లారనివ్వాలి. ఈ క్రీమ్ ని ఒక సీసాలో నిల్వ చేసి ఫ్రిజ్ లో పెడితే రెండు వారాల పాటు నిల్వ ఉంటుంది. ఒక బౌల్ లో ఒక స్పూన్ క్రీమ్ తీసుకొని దానిలో అరస్పూన్ కాఫీ పౌడర్ కలిపి ముఖానికి రాసి పది నిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద ఎటువంటి సమస్యలు లేకుండా తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. కాస్త ఓపికగా చిట్కాలను పాటిస్తే చాలా తక్కువ ఖర్చులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సులభంగా ఇంటిలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.