Beauty Tips

White Hair Turn black:వారంలో 2 సార్లు ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది

White Hair Turn black:వారంలో 2 సార్లు ఇలా చేస్తే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.. జుట్టుకి సంబంధించిన సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఒత్తిడి, పొల్యూషన్ వంటి అనేక రకాల కారణాలతో చాలా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారుతుంది.

ఇలా చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారటం వలన మనలో చాలా మంది కంగారుపడి మార్కెట్లో దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ వేస్తూ ఉంటారు.అలా వేయటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య వస్తుంది.

అలా కాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే తెల్ల జుట్టు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.

ఒక బౌల్లో ఒక కప్పు తాజా గోరింటాకు పేస్ట్ తీసుకోవాలి. దానిలో మూడు స్పూన్ల ఉసిరి పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి వేసి బాగా కలపాలి. దీనిలో అవసరమైతే కొంచెం నీటిని కూడా కలపవచ్చు. ఈ పేస్ట్ ని బ్రష్ సాయంతో జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించాలి. ఆ తర్వాత ఒక గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.