Kitchenvantalu

Flies In Home : వేసవిలో ఇంట్లోకి ఈగలు రాకుండా ఏం చేయాలి? చాలా సింపుల్..

Flies In Home : వేసవిలో ఇంట్లోకి ఈగలు రాకుండా ఏం చేయాలి? చాలా సింపుల్.. ఈగలు ఇంటిలో లేకుండా చేయటం ఎలా….. ఇలా చేస్తే చాలు ఈగలు మాయం….ఎలా అంటే…రెండు రెక్కలు కలిగిన కీటకాలు ప్రపంచంలో 1.20 మిలియన్ కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి.

ఈగను శాస్త్రీయంగా ‘ముస్కా డొమెస్టిక్’ అని పిలుస్తారు. ఈగల కారణంగా కలరా, విరేచనాలు, టైఫాయిడ్ మరియు అతిసారం వంటి వ్యాధులు వస్తాయి. అంతేకాక వాటిని వ్యాప్తి కూడా చేస్తాయి. అలాగే తీవ్రమైన కంటి వ్యాధులు కూడా వస్తాయి.

ఈగలు రావటానికి కారణాలు
ఈగలు పరిశుభ్రత లేని ప్రదేశాలు మరియు చెత్త లేదా మల పదార్థం ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. మూతలు వేయని ఆహార పదార్ధాలు ఈగలను ఆకర్షిస్తాయి. వృక్ష మరియు మందపాటి పొదల వంటి ప్రాంతాలు ఈగలు పెరగటానికి అనువైన ప్రదేశాలుగా ఉన్నాయి.

1. కర్పూరం
ఈగలను వదిలించుకోవటానికి ఇది గొప్ప పరిష్కారం. ఈగలు ఉన్నగదిలో కర్పూరంను వెలిగిస్తే ఆ పొగకు వెంటనే ఈగలు బయటకు పోతాయి.

2. తులసి చెట్టు
తులసిలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. ఇది ఈగలను తరిమికొట్టటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేవలం తులసి చెట్టును పెరటిలో పెంచుకుంటే సరిపోతుంది.

3. కారం పొడి
ఒక స్ప్రే సీసా లో కారం పొడి మరియు నీటిని పోసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇంటి చుట్టూ స్ప్రే చేస్తే ఈగలు చనిపోతాయి.

4. పేపర్ ఫ్లై
మొండి ఈగలను వదిలించుకోవటానికి మనమే స్వయంగా కాగితంతో తయారుచేసుకోవచ్చు. ఒక బౌల్ లో చక్కెర మరియు జొన్న పిండితో సిరప్ తయారుచేసుకొవాలి. ఈ సిరప్ ని మందపాటి కాగితం మీద బ్రష్ సాయంతో రాయాలి. ఈ పేపర్ ని గది లేదా బయట పెడితే ఈగలు లోపలికి రావు.

5. ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ అనేది ఈగలను వదిలించుకోవటానికి మరో సమర్ధవంతమైన మార్గం. ఒక బౌల్ లో ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు ద్రవ డిటర్జెంట్ వేసి బాగా కలిపి ఈగలు ఉన్న ప్రదేశంలో పెడితే, ఈ ద్రావణానికి ఆకర్షితమై ఈగలు చనిపోతాయి.

6. ఎసెన్షియల్ ఆయిల్స్
ఇంటిలో ఈగలను నివారించటానికి ఎసెన్షియల్ ఆయిల్స్ బాగా సహాయపడతాయి. లావెన్డేర్, యూకలిప్టస్, పిప్పరమెంట్ మరియు నిమ్మ గడ్డి నూనెలు ఈగలను తరిమికొట్టటానికి సహాయపడతాయి. బెడ్ రూం లేదా వంటగదిలో ఈ నూనెలను చల్లితే ఈగలు బయటకు పోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.