Healthhealth tips in telugu

Pumpkin Seeds:గర్భధారణ సమయంలో గుమ్మడి గింజలు తింటే ఏమి అవుతుందో తెలుసా…

Pumpkin Seeds:గర్భధారణ సమయంలో గుమ్మడి గింజలు తింటే ఏమి అవుతుందో తెలుసా… గర్భధారణ సమయంలో తీసుకోవలసిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఈ రోజు గర్భధారణ సమయంలో గుమ్మడి గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో చూద్దాం.

ఇప్పుడు గుమ్మడి గింజలు చాలా విరివిగా లభిస్తున్నాయి. ప్రతి రోజు ఒక స్పూన్ గుమ్మడి గింజలను తీసుకోవాలి. ఈ గింజలలో ఐరన్, జింక్ మరియు మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. ఇవి గర్భధారణ సమయంలో అవసరం.

గుమ్మడి గింజలలో జింక్ సమృద్దిగా ఉండుట వలన పిండం అభివృద్ధికి సహాయపడుతుంది. జింక్ కణాల పెరుగుదల మరియు విభజనలో పాల్గొంటుంది మరియు నాడీ వ్యవస్థ అభివృద్ధిలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది. గుమ్మడి గింజలలో ఇనుము సమృద్దిగా ఉంటుంది. ఇది శరీర కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడానికి అవసరం.

అలాగే గర్భధారణ సమయంలో ఇనుము చాలా ముఖ్యమైనది, ఎందుకంటే పెరుగుతున్న పిండం సరిగ్గా అభివృద్ధి చెందడానికి ఆక్సిజన్ అవసరం. గర్భదారణ సమయంలో రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. గర్భధారణ సమయంలో సాదారణంగా రక్తహీనత సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

గుమ్మడి గింజల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో ఫైబర్ సమృద్దిగా ఉంటుంది, ఇది సాధారణ ప్రేగు కదలికలను నిర్వహించడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.