Kitchenvantalu

Dabha Style Paneer Bhurji:ఎక్కువ మసాలాలు లేకుండా చపాతీలోకి త్వరగా చేసుకొనే సూపర్ కర్రీ

Dabha Style Paneer Bhurji:ఎక్కువ మసాలాలు లేకుండా చపాతీలోకి త్వరగా చేసుకొనే సూపర్ కర్రీ.. ప్రొటీన్స్ పుష్టిగా ఉండే,పన్నీర్ తో పంజాబీ దాబా స్టైల్,పన్నీర్ భుర్జీ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. రోటీలోకి సూపర్ కాంబినేషన్.

కావాల్సిన పదార్ధాలు
శనగపిండి – 2 టేబుల్ స్పూన్స్
పెరుగు – 1/2కప్పు
పాలు – 1/4కప్పు
పసుపు – 1/4టేబుల్ స్పూన్
నల్ల ఉప్పు – 1/2టేబుల్ స్పూన్
కసూరి మేతి – 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
కశ్మీరి కారం – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – 2 టేబుల్ స్పూన్

భుర్జీ కోసం
నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్
బటర్ -2 టేబుల్ స్పూన్స్
పన్నీర్ – 200 గ్రాములు
జీలకర్ర – 1/2టేబుల్ స్పూన్
ఉల్లి పాయ తరుగు – 1 కప్పు
పచ్చిమిర్చి – 3
అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్
టమాటాలు – 3
ఉప్పు – తగినంత
కొత్తిమీర – తగినంత
వేడి నీళ్లు – 1/2కప్పు
నిమ్మరసం – 1/2టీస్పూన్

తయారీ విధానం
1.స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని, సన్నని సెగపై శనగపిండిని దోరగా వేయించి పక్కనపెట్టుకోవాలి.
2.మరో గిన్నెలో వేగిన శనగపిండి, గ్రేవీ కోసం తీసుకున్న పదార్ధాలు అన్ని వేసి పక్కన పెట్టుకోవాలి.
3.ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి, కరిగించి, కశ్మీరీ కారం వేసి, ఒక పొంగు రానిచ్చి, కలుపుకున్న మసాలా పేస్ట్ లో కలుపుకోవాలి.

4.భుర్జి కోసం నెయ్యి, వెన్న కరిగించి, జీలకర్ర వేసి, తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వేసి, ఫ్రై చేసుకోవాలి.
5. వేగిన ఉల్లిలో, టమాటో తరుగు వేసి, మగ్గనివ్వాలి.
6. టమాటాలు మెత్తపడిన తర్వాత కలపి పెట్టుకున్న మసాలా మిశ్రమం, ఉప్పు, కొత్తిమీర, వేసి, వేడి నీళ్లు పోసి,ఉడకనివ్వాలి.
7. నూనె పైకి తేలిన తర్వాత, పన్నీర్ తురుము వేసుకుని, నెయ్యి పైకి తేలేవరకు వేపుకోవాలి.
8. చివరగా, కొత్తిమీర తరుగు, నిమ్మరసం పిండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.